Apr 28,2023 22:15

విరాళం అందజేస్తున్న బత్తల హరిప్రసాద్‌

కదిరి టౌన్‌ : గాండ్లపెంట మండలం వేపరాల గ్రామంలోని నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారాముల దేవాలయ అభివృద్ధికి వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ బత్తల హరిప్రసాద్‌ తనవంతు విరాళం అందజేశారు. రామాలయ నిర్మాణానికి సహకారం అందించాలని గ్రామస్తులు కోరగా స్పందించిన ఆయన 25వేలను అందజేశారు. బూసిరెడ్డి వెంకటరెడ్డి, జయచంద్రారెడ్డి, ఆనంద్‌ రెడ్డి, గంగిశెట్టి, నాగరాజు, రామచంద్ర తదితరులకు అందజేశారు ఈ కార్యక్రమంలో కదిరి రూరల్‌ మండలం వైస్‌ ఎంపీపీ బత్తల ఆదినారాయణ, కదిరి పట్టణ అధ్యక్షులు బహువుద్దీన్‌, వైసిపి లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి లింగాల లోకేశ్వర్‌ రెడ్డి, వడ్డెర నాయకులు సంపంగి గోవర్ధన్‌, వైఎస్‌ఆర్‌సిపి విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి వంకధార రాఘవేంద్ర, నాయకులు రామచంద్ర, బత్తల యువజన సభ్యులు పాల్గొన్నారు.