Jul 04,2023 16:45

మాట్లాడుతున్న నాయకులు

అల్లూరి ఆశయాలను కాలరాస్తున్నారు
మాట్లాడుతున్న నాయకులు
ప్రజాశక్తి - శ్రీశైలం ప్రాజెక్టు

పోరాడి సాధించిన గిరిజన, ఆదివాసి హక్కులను నేటి పాలకులు కాల రాస్తున్నారని సున్నిపెంట ఐటీడీఏ పరిధిలోని ప్రభుత్వ గిరిజన పాఠశాల ఆవరణంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 120వ జయంతి సందర్భంగా కొమరం భీమ్‌ ఆదివాసి చెంచు గిరిజన సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు వై.ఆశీర్వాదం పేర్కొన్నారు. ముందుగా గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపల్‌ పి.రెడ్డప్ప అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆశీర్వాదం, ప్రిన్సిపాల్‌, సీతారామరాజు అలాగే తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డు కొమరయ్య జయంతి సందర్భంగా ఇరువురి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరము వారు మాట్లాడుతూ విప్లవ వీరుడు అల్లూరి ఆశయాలను కొనసాగించాలన్నారు. ఆదివాసి చెంచు గిరిజనుల అడవి సంపద హక్కులను కాపాడేందుకు అల్లూరి ఆశయాలను పోరాట రూపంలో హక్కులను కాపాడుకోవాలన్నారు. అలాగే దొడ్డు కొమురయ్య సామాన్య ప్రజల హక్కుల కొరకు పోరాడి అమరుడైన కొమరయ్య ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన పాఠశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ కృపాకర్‌, ఐఎఫ్టియు మండల నాయకులు పి.మల్లికార్జున, వార్డెన్‌ నాసరయ్య మహిళా ఉపాధ్యాయులు ఐటిడిఏ విశ్రాంతి ఉద్యోగి బ్రహ్మయ్య పాల్గొన్నారు .