ఆలిండియాస్థాయిలో గుడ్లవల్లేరు పాలిటెక్నికల్ విద్యార్థుల ప్రతిభ
ప్రజాశక్తి-గుడ్లవల్లేరు
నాల్గో ఆలిండియా సౌత్ జోన్ పాలిటెక్నిక్ గేమ్స్ అండ్ అథ్లెటిక్స్ 2022-23 మీట్‌లో ఆంధ్రప్రదేశ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఓవరాల్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకోవడంలో రాష్ట్రం తరఫున గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచినట్లు కళాశాల ప్రిన్సిపల్ జి.వి.వి.సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వి ఎస్ ఆర్ విజ్ఞానజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్ వేదికగా ఈనెల 11, 12 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వ దక్షిణ భారత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన వారిలో 11 మంది విద్యార్థులు గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ వారే కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌కు బాలుర చెస్ 200 మీటర్లు, 400 మీటర్లు, 4ఐ 400 మీటర్లు, రన్నింగ్‌లో బంగారు పతకాలు గెలిచి, బాలికల వాలీబాల్, టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లలో విన్నర్స్ గా నిలిచి ఆంధ్ర రాష్ట్ర క్రీడా ఖ్యాతిని దక్షిణ భారతదేశ నలుమూలల వ్యాప్తి చేశారు. బహుమతి సాధించిన విద్యార్థులను, వారికి సహకరించిన ఫిజికల్ డైరెక్టర్ వి.శ్రీనివాసరావు, కె.పిచ్చయ్యలను పాలిటెక్నిక్ యాజమాన్య సభ్యులు, ఎగ్జిక్యూటివ్ మెంటార్ ఎన్‌ఎస్‌ఎస్‌వి రామాంజనేయులు, ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు.










