Oct 29,2023 09:35

ప్రజాశక్తి-అమరావతి: ఎన్నికల్లో జగన్ రెడ్డి టీచర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమని టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్నారు. టీచర్లను మద్యం షాపుల ముందు కాపలా ఉంచి, మద్యం అమ్మించారని, టీచర్లచే బాత్ రూమ్ లు కడిగించారని ఆగ్రహించారు. బదిలీల విషయంలో న్యాయం చేయమని అడినందుకు ఉపాధ్యాయులపై లాఠీ ఝులిపించారు. పి ఆర్ సి పై ఆందోళన చేస్తుంటే పోలీసులతో కొట్టించారని మండిపడ్డారు. సీపీఎస్ రద్దు హామీని అమలు చేయమంటే భౌతికంగా దాడులు చేశారని, 3 ఏళ్లుగా అమలు చేయని బయోమెట్రిక్ విధానాన్ని ఉపాధ్యాయులపై కక్షపూరితంగా అమలు చేస్తున్నారన్నారు. కరోనా సమయంలో దాదాపు 1500 మంది ఉపాధ్యాయులకు చనిపోతే వాళ్లు కుటుంబాన్ని ఆదుకోలేదు.టీచర్లకు అనధనంగా ముఖహాజరు, అనంతరం విద్యార్థుల హాజరు, బాత్‌రూమ్‌ల ఫొటోలు, మధ్యాహ్న భోజనం ఫొటోలు, నాడునేడు ఫొటోలు, గుడ్లు, చిక్కీల ఫొటోలు అంటూ టీచర్లపై పరిమితికి మించి యాప్‌ల భారం మోపారని తెలిపారు. సిపియస్ ఉద్యమం చేశారని అనేక మంది పై బైడోవర్ కేసులు, వంటివి పెట్టారని, టీచర్లు, ఉద్యోగస్థులు సిపియస్ మీద ఉద్యమం చేశారని బయోమెట్రిక్ విధానం తీసేసి ఫేస్ రికగ్నేషన్ అటెండన్స్ పెట్టారని తెలియజేశారు. ఫేస్ రికగ్నేషన్ కి నెట్ వర్క్ కావాలని, అందుకు ఉపాధ్యాయుల ఫోన్లనే డేటాని వాడి అప్ లోడ్ చేయాలనడం దుర్మార్గమన్నారు. ఆశా వర్కర్లకి, అంగన్ వాడీ వాళ్లకు తక్కువ జీతం కాబట్టి  టాబ్ లను ఇచ్చామంటున్నారని,  ఎక్కువ జీతం కాబట్టి ఉపాధ్యాయుల ఫోన్ లలోనే అటెండెన్స్ ను ఇవ్వండని ప్రభుత్వం వింత వాదనను తీసుకురావడం సిగ్గుచేటన్నారు. బైజూస్  ట్యాబ్ లలో విద్యార్ధులు ఏం నేర్చుకుంటున్నారో అప్ లోడ్ చేయలేదని ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపక్షానికి వ్యతిరేకంగా ప్రచారంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు.
ఒకరోజు ప్రవీణ్ ప్రకాశ్ ఉపాధ్యాయుల విధులు నిర్వహిస్తే వారి బాధలేంటో ఆయనకు తెలుస్తాయి.పాఠ్యపుస్తకాల పంపిణీ, నాడు నేడులో పనుల్లో ప్రభుత్వ లోపాలను టీచర్లపై నెట్టి ఏదో ఒక సాకును బూచిగా చూపించి సస్పెన్షన్లు చేస్తున్నారు. గతంలో పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రవీణ్ ప్రకాష్ పర్యవేక్షిస్తూ కుంటి సాకులతో డీఈవో, నలుగురు పర్యవేక్షణాధికారులను సస్పెండ్ చేశారు. దొడ్డిదారి బదిలీలు, జీవో 117, అధిక పని ఒత్తిడితో టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎట్టి4వేయాలి, ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి. ఉపాద్యాయుల్ని ఉక్కుపాదంతో అణిచి వేస్తున్న ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు.