Sep 26,2023 22:35

ప్రజాశక్తి - కలిదిండి
  గుడివాడలో ఈనెల 11వ తేదీ నుంచి 24 వరకు రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, క్విజ్‌, క్లాసికల్‌ డ్యాన్స్‌, ఫాన్సీ డ్రెస్‌, పెయింటింగ్‌, స్పెల్‌ బీ, మ్యూజికల్‌ ఛైర్‌ పోటీలలో స్థానిక కలిదిండి పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు 16కు పైగా ప్రథమ, ద్వితీయ స్థానాలతో పాటు ప్రత్యేక బహుమతులు సాధించినట్లు సంస్థ అధినేతలు సానా వెంకట రామారావు, మీనా సరస్వతి తెలిపారు. గుడివాడలో కార్పొరేట్‌ సంస్థలకు దీటుగా ఆల్‌ రౌండర్స్‌గా నిలిచిన విద్యార్థులను, సహకరించిన ఉపాధ్యాయ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. వివిధ పోటీలలో విద్యార్థులు బహుమతులు సాధించడం పట్ల తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.