ప్రజాశక్తి - ఆదోని
ఈనెల 20, 21న కర్నూలు జరిగే ఆక్రందన దీక్షలను విజయవంతం చేయాలని ఎస్‌టియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎస్.నరసింహులు, రాష్ట్ర పురపాలక కమిటీ సభ్యులు వి.రమేష్ నాయుడు, సీనియర్ నాయకులు బి.గోపాల్ కోరారు. గురువారం ఆదోనిలోని ఎస్‌టియు భవన్‌లో ఆదోని మండల అధ్యక్షులు ఎంసి.సుంకన్న అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆర్థిక బకాయిలు, ఆర్జిత సెలవులు, ఎపిజిఎల్‌ఐ బకాయిలు, డిఎ బకాయిలు, 11వ పిఆర్‌సి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలివచ్చి నిరవధిక నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం గోడపత్రికను ఆవిష్కరించారు. నాయకులు రామ్మోహన్ రెడ్డి, దాసన్న, ఈరప్ప, వెంకటేష్, సుధాకర్ బాబు, చిరంజీవి, షేక్షావలీ, లక్ష్మన్న పాల్గొన్నారు.
గోడపత్రికను ఆవిష్కరిస్తున్న నాయకులు










