ప్రజాశక్తి - వీరఘట్టం : మండలంలోని తెట్టంగి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రాంగణం ఆక్రమణకు గురైందని ఆ గ్రామస్తులు కలెక్టర్ నిశాంత్‌కుమార్‌కు, పాలకొండ సబ్ కలెక్టర్ నూరుల్ కమర్‌కు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం పాలకొండ సబ్ కలెక్టర్ గ్రామానికి చేరుకొని పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. గతంలో ఎస్సీ కాలనీకి సమీపానున్న స్థలాన్ని, జగనన్న లేఅవుట్ దగ్గర కూడా స్థలాన్ని పరిశీలించారు. పాఠశాల ఆవరణలో ఉన్న ఈ ఇళ్లను తొలగించి వేరే చోటికి నిర్మాణాలు చేపడితే పాఠశాల అభివృద్ధి చెందుతుందని గ్రామస్తులు సబ్‌కలెక్టరు దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు విద్యా ప్రమాణాలపై ఆరా తీశారు. చక్కగా చదివి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలన్నారు. ఆయనతో పాటు సర్పంచు అలజంగి విజయమ్మ, పాలకొండ ఎఎంసి ఉపాధ్యక్షులు పొట్నూరు లక్ష్మణరావు, పరిశినాయుడు, ఎస్.చిన్నంనాయుడు, వి.కృష్ణమోహన్, తహశీల్దారు సిహెచ్ సత్యనారాయణ, ఎంఇఒ గౌరునాయుడు, ప్రధానోపాధ్యాయులు డి.నాగమణి, ఆర్‌ఐ ఎస్.మారుతీరావు, విఆర్‌ఒ రెయ్యన్న, సచివాలయ కార్యదర్శి బంగారు బాబు, తదితరులు పాల్గొన్నారు.










