Oct 18,2023 20:04

గ్రామ చావిడి ప్రారంభిస్తున్న మహంతేశ్వర స్వామి, ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి

ప్రజాశక్తి - కౌతాళం
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమాలు చేసి జైలుకు వెళ్లారని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పొదలకుంట గ్రామంలో 'జగనన్న ఆరోగ్య సురక్ష' నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి బాబును జైలుకు పంపారని టిడిపి నాయకులు ఆరోపించడం అవాస్తవమని తెలిపారు. టిడిపి శ్రేణులు బాబు అక్రమాలను దాచి పెట్టాలని చూస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. అనంతరం రూ.10 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ చావిడిని హాల్వి సిద్ధేశ్వర మఠం పీఠాధిపతులు మహంతేశ్వర స్వామి చేతులమీదుగా ప్రారంభించారు. వైసిపి మండల కన్వీనర్‌ దేశాయి ప్రహ్లాద చారి, ఎంపిపి అమ్రేష్‌, వైస్‌ ఎంపిపి బుజ్జిస్వామి, కోఆప్షన్‌ సభ్యులు మాబు సాబ్‌, మండల నాయకులు ఏకంరెడ్డి, హాల్వి చెన్నప్ప, బసవ ప్రభు, మర్రి గౌడ్‌, సుబ్బరాజు, రాఘవేంద్రారెడ్డి, మల్లయ్య, సోమనాథ్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు.