అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న అధికారులు
ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలోని నాలుగో వార్డు గణేష్ సర్కిల్ ఉర్దూ స్కూల్ వద్ద అక్రమ కట్టడాలు కూల్చివేత ముమ్మరం అయింది. మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించుకున్న ఇల్లు, కట్టడాలను మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో కూల్చి వేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న కట్టడాలను గుర్తించామన్నారు.
బసాపురం ట్యాంకు నీటి మళ్లింపు
ఎస్‌ఎస్ ట్యాంకు పనులు పూర్తి దశకు చేరుకున్నాయని కమిషనర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు. పనులను పరిశీలించామన్నారు గురువారం నుంచి ఎల్‌ఎల్‌సి కాలువ ద్వారా బసాపురం ట్యాంకులోకి పంపింగ్ చేస్తున్నామని తెలిపారు. పట్టణ వాసులకు నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. డిఇ వెంకట చలపతి రెడ్డి, ఎఇ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు.










