ప్రజాశక్తి-ఆలూరు
అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలపైనా, ప్రతిపక్ష నాయకులపైనా, కార్యకర్తలపైనా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా అక్రమ కేసులు పెట్టి ఆనంద పడుతున్న సైకో జగన్మోహన్ రెడ్డి అని టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో ఆలూరు పాతబస్టాండ్‌లో నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, సుజాతమ్మ మాట్లాడారు. 'ఒక్కఛాన్స్' పేరుతో అధికారం చేపట్టిన జగన్ పాలన చూసిన ప్రజలు ఈ పాలన మాకొద్దంటున్నారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ సైకోగా మారారని విమర్శించారు. చంద్రబాబు 'భవిష్యత్తుకు గ్యారెంటీ సభలకు, లోకేష్ పాదయాత్రలకు జన నీరాజనాలు చూసి ఓర్వలేకనే కుట్ర పన్ని అక్రమ కేసులతో అరెస్టు చేయించారని తెలిపారు. సి.నారాయణరెడ్డి, కురువ జయరామ్, సులక్షణ రెడ్డి పాల్గొన్నారు.
ఆలూరులో మాట్లాడుతున్న కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి










