ప్రజాశక్తి - ఆదోని
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను పరిష్కరించాలని 'చలో విజయవాడ'కు వెళ్తున్న అంగన్వాడీలను అరెస్టు చేయడం దారుణమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వీరన్న, పద్మ, గోపాల్, మహానంది రెడ్డి, తిప్పన విమర్శించారు. సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీలకు నెలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలన్నారు. పని భారం తగ్గించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పర్మినెంట్ చేయాలని కోరారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అంగన్వాడీలు నినాదాలు చేసి పరిపాలన అధికారి గోవింద్ సింగ్‌కు వినతిపత్రం ఇచ్చారు. నాయకులు కృష్ణమూర్తి, అంగన్వాడీ నాయకులు లలిత కుమారి, మాలమ్మ ఉన్నారు.
సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించిన అంగన్వాడీలు










