- ఉద్యోగులకు ఎఐఎస్‌జిఇఎఫ్, సిసిజిఇడబ్య్లుల పిలుపు
- మార్చి 26న విశాఖలో బహిరంగసభ
- నవంబరు 3న ఛలో ఢిల్లీ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పాత పెన్షన్ విధాన సాధన, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణే లక్ష్యంగా పోరాటానికి సిద్ధం కావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంటు ఎంప్లాయిస్ ఫెడరేషన్ ( ఎఐఎస్‌జిఇఎఫ్), కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య (సిసిజిఇడబ్య్లు)లు పిలుపునిచ్చాయి. ఆదివారం నాడు విజయవాడలోని ఎంబివికేలో ఆ సంస్థల ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గను ఆ సంఘాల నాయకులు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. నేషనల్ పైప్ లైన్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడానిు మానుకోవాలని కోరారు. ఈ లక్ష్యాల సాధన కోసం దశలవారీగా పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా విస్తృత ప్రచారం, రాష్ట్రాల వారీ సదస్సులు, సభలతో పాటు నవంబర్ మూడవ తేదిన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 26న విశాఖలో బహిరంగసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎఐఎస్‌జిఇఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు, ఎపిఎన్‌జిఓ సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎఐఎస్‌జిఇఎఫ్ ఛైర్మన్ సుభాష్ లాంబా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు జిల్లా తాలుకా, మండల కేేంద్రాల్లో సదస్సులు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో 100 బస్‌స్టాండ్‌లను ప్రైవేటీకరించేందుకు ప్రయతిుస్తున్నారన్నారు. విలువైన ఆస్తులను ప్రైవేటుకు లీజుకు ఇచ్చే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపిలు ఒక సారి గెలిస్తేనే వారికి పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం 25,30 ఏళ్లు సర్వీస్ చేస్తును ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ హక్కును ఎలా తీసి వేస్తుందని ప్రశిుంచారు. దీనికోసం మార్చి 14న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. అనేక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎన్‌పిఎస్ నుంచి ఓపిఎస్‌కు వచ్చాయన్నారు. సంఘ జనరల్ సెక్రటరీ ఎ. శ్రీకుమార్ మాట్లాడుతూ నవంబరు 3న జరగనును చలో ఢిల్లీ కార్యక్రమానిు జయప్రదం చేయాలని కోరారు. డిసెంబరు 8న న్యూఢిల్లీలో జరిగిన జాయింట్ నేషనల్ కన్వెన్షన్‌లో ఈ నిర్ణయం తీసుకునుట్లు తెలిపారు. పార్లమెంటు వద్ద ధరాు, బైక్ ర్యాలీలు, పాఠశాలల వద్ద ప్రచారం వంటి దశల వారి కార్యక్రమం తరువాత నవంబర్‌లో చలో ఢిల్లీ నిర్వహిస్తామనితెలిపారు. రీపిల్ పిఎఫ్‌ఆర్‌డిఎ యాక్ట్ ను రద్దు చేయాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, రోజు వారీ వేతనం పొందేే ఉద్యోగులందరినీ క్రమబద్దీకరించాలని, ట్రేడ్ యూనియన్ డెమెక్రాటిక్ రైెట్స్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, సంస్థలు అనిు కలిసి పోరాటం చేయాలనాురు. కేంద్ర ఫ్రభుత్వం మేక్‌ఇన్ ఇండియా ప్రోగ్రాం పేరుతో ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిందని, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ప్పటికీ ఖాళీలను భర్తీ చేయడం లేదనాురు. ప్రభుత్వ రంగ సంస్ధలైన ఎయిర్‌పోర్టులు, జాతీయ రహదారుల నిర్వహణ, బ్యాంకులు, ఇన్స్యూరెన్స్ సంస్థలు, ఫ్యాక్టరీలు, నౌకాశ్రయాలు ప్రైవేటీకరణ చేస్తున్నాయన్నారు. కాన్ఫడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవరుమెంటు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ (సిసిజిఇడబ్ల్యు) ఎపి, అండ్ టిఎస్ నాయకులు ఎ. అజీజ్ మాట్లాడుతూ ఏడు డిమాండ్లపై కేంద్రరాష్ట్ర ఫ్రభుత్వాల మీద వత్తిడి పెంచుతామని, అనివార్యమైతే సమ్మెకు సైతం వెనుకాడమని అన్నారు.
ఎన్‌పిఎస్ అనేది ఒక దోపిడీ అని అన్నారు. ఫండ్‌మేనేజర్‌గా ఉన్న ఎల్‌ఐసి అదాని కంపెనీల్లో అత్యధిక భాగం షేర్లలో పెట్టుబడులు పెట్టిందన్నారు, అదానికి ఉన్న 7 కంపెనీల్లో జనవరి 24న వారి షేర్ల విలువ రూ.74వేలకోట్లు కాగా, పిబ్రవరి 23న షేర్ల విలువ రూ.26వేలకోట్లకు పడిపోయాయన్నారు. ఫలితంగా నికరంగా 45వేలకోట్ల మేర ఎల్‌ఐసి నష్టపోయిందన్నారు.
ఎఐఎస్‌జిఇఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించే వరకు తమ పోరాటం సాగుతుందన్నారు. కొత్త పిఆర్‌సి సాధన కోెసం అవసరమైతే సమ్మె చేయడానికి కూడా ఉద్యోగులు సిద్ధంగా ఉండాలన్నారు. ఎఐఎస్‌జిఇఎఫ్ ఎన్‌సిసి మెంబరు శాంతిశ్రీ మాట్లాడుతూ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిసిజిఇడబ్లు ఎపి, టిఎస్ అధ్యక్షులు వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ 1.1.2004 నుంచి ఈ స్కీమ్ అమల్లోకి వచ్చిందని, కేంద్రంలో స్కీమ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రూపంలో రాగా 2013లో చట్టంగా మారిందన్నారు. అప్పట్లోనే కొత్త పెన్షన్ విధానం వద్దంటూ పోరాటం మొదలు పెట్టామన్నారు.
ఈ సమావేశంలో ఎపి ఎన్‌జిఓ అసోసియేషన్ కెవి శివారెడ్డి, ఎపి జెఎసి సెక్రటరీ జనరల్ హృదయరాజు, ఎం .రాజ్యలక్ష్మీ, ఎపి ఎన్‌జిఓ అసోసియేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్ పురుషోత్తమనాయుడు, ఎన్‌ఎఫ్‌పిఇ కన్వీనరు బి.శ్రీధర్‌బాబు, సిఓసి డిఫెన్స్ రెడ్డి వెంకటరావు, ఐటిఇఎఫ్ స్టేట్ సెక్రటరీ ఎంవి ప్రసాద్, ఆర్‌ఎంఎస్ స్టేట్ సెక్రటరీ కె.మృదుల, ఎపి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు జానిపాషా తదితరులు ప్రసంగించారు.










