Sep 17,2023 17:11

ప్రజాశక్తి-పత్తికొండ : ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంటలు వర్షాలు లేక ఎండు ముఖం పట్టి నష్టం వాటిల్లిందని, పత్తికొండను కరువు మండలంగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కార్యదర్శి సిద్దయ్య గౌడ్ డిమాండ్ చేశారు ఆదివారం కామ్రేడ్ ఈశ్వర్ రెడ్డి భవనంలో రైతు సంఘంమండల అధ్యక్షులు రాముడు అధ్యక్షతన రైతు సంఘం నాయకులు , రైతులు తో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రైతు సంఘం మండల కార్యదర్శి సిద్దయ్య గౌడ్ హాజరై మాట్లాడారు. పత్తికొండ మండలం గ్రామీణ ప్రాంతాలలో రైతులు వర్షాధారం కింద పంట పొలాలను సాగు చేస్తారు. ఖరీఫ్ సీజన్లో అరకోరా వర్షాలకు పత్తి వేరుశనగ టమోటా కంది, సబ్జా ఆముదం తదితరులు పంటలను రైతులు సాగు చేశారని అన్నారు. జూన్ జూలై మాసంలో అరకోరా వర్షాలు,ఆగస్టు మాసంలో వర్షాలు పడకపోవడంతో రైతులు సాగు చేసిన పంటలు ఎండు ముఖం పట్టి దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పందికోన రిజర్వాయర్ నుండి పిల్ల కాలువలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంటల కు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.వ్యవసాయ అధికారులు రైతులకు  సలహాలు సూచనలు ఇచ్చిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి రైతులకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో రైతు సంఘం మండల కమిటీ సభ్యులు పెద్దహుల్తి బ్రహ్మయ్య, మండగిరి రామాంజనేయులు రాముడు రంగన్న వెంకటేశ్వర్లు ఆవాజ్ కమిటీ మండల కార్యదర్శి తాజ్ మహమ్మద్ రైతులు పాల్గొన్నారు..