హిందూపురం:హిందూపురం నియోజక వర్గంలో వచ్చే ఎన్నికల్లో వైసిపి జెండా ఎగరాలంటే అందరూ కలిసి ఐక్యంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వైసిపి నియోజక వర్గ సమన్వయ కర్త దీపిక భర్త వేణు రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని వైసిపి కార్యాలయంలో రూరల్ మండల నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో హిందూపురం నియోజకవర్గంలో ఉన్న విభేదాలు, గ్రూపులను పక్కనపెట్టి రానున్న ఎన్నికల్లో వైఎస్.జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలన్నారు. హిందూపురంలో 2024లో వైసీపీ జెండా ఎగరవేయడానికి ప్రతి ఒక్క వైసీపీ కుటుంబ సభ్యుడు సైనికుల్లా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో వైసిపి రాష్ట్ర సహాయ కార్యదర్శి కొటిపి హనుమంత రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకుడు నక్కలపల్లి శ్రీరామ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.










