ఐక్య పోరాటాలతోనే హక్కులు
- సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు
- జిల్లా వ్యాప్తంగా సిఐటియు ఆవిర్భావ దినోత్సవం
ప్రజాశక్తి - నంద్యాల
ఐక్య పోరాటాల ద్వారానే హక్కులు సాధ్యమవుతాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు అన్నారు. సిఐటియు 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా జెండావిష్కరణలు జరిగాయి. నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్లో లారీ హమాలీ, ఆర్టీసీ హమాలీ, టెక్కె మార్కెట్ యార్డ్ హమాలీ, నూనెపల్లి హమాలీ, నూనెపల్లి ఆటో వర్కర్స్, రైల్వేగూడ్ షెడ్ ముఠా వర్కర్ తదితర యూనియన్ల ఆధ్వర్యంలో సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, కే మహమ్మద్ గౌస్, పట్టణ కోశాధికారి వెంకట లింగంలు జెండావిష్కరణ ఆరు చోట్ల చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 1970 మే 30న కోల్‌త్తాలో సిఐటియు ఏర్పడిందన్నారు. నాటి నుంచి ఉద్యోగ, కార్మిక సమస్యలపై రాజీలేని పోరాటం సిఐటియు చేస్తుందన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర వేతన చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో, లారీ, ట్రాన్స్పోర్ట్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి రవాణా రంగ కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పిఎఫ్, ఈఎస్‌ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలన్నారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇల్లు స్థలం ఇచ్చి నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పోరాటాలకు సిద్ధం కావాలని తెలిపారు. కార్యక్రమంలో ఆయా యూనియన్ నాయకులు సుబ్బారావు, జైలాన్, గోపాల్, సుబ్బరాయుడు ,రాజు, బలరాం, మాధవ, ఎల్లయ్య, ఆంజనేయులు, మధు, ఏసన్న, నరసింహా, కార్మికులు పాల్గొన్నారు. ఆత్మకూరు : పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట సిఐటియు జెండాను సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏసురత్నం ఆవిష్కరించారు. సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రజాక్, రామ్ నాయక్, ఉపాధ్యక్షులు రణధీర్, మండల కార్యదర్శి భాస్కర్, నరసింహ నాయక్, నాయకులు, సురేంద్ర, సద్దాం, జేబివుల్లా, చాంద్ భాషా, రైట్ బాషా, రఫీ, శివకుమార్, నబిసా, గణపతి, రాము, రవి తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు : సుండిపెంట కాలనీలో సిఐటియు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సంఘం కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. మండల అధ్యక్షులు దర్శనం నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా నాయకులు మునిపాటి చిన్న మారెన్న, సిపిఎం మండల నాయకులు జి.నాగసైదయ్య మాట్లాడారు. సిఐటియు మండల నాయకులు ఎం.మల్లికార్జున, అనుబంధ సంఘాల నాయకులు శివ, వినరు, రవి, అశోక్, శ్రీకాంత్, జోసఫ్, ఊదరదాసు, అభిషేక్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పాణ్యం: మండలంలోని తమ్మరాజు పల్లి గ్రామంలో హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో ఎర్రజెండాను సిఐటియు మండల కార్యదర్శి భాస్కర్ ఎగురవేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు బత్తిని ప్రతాప్, కె.జె శ్రీనివాసరావు, హమాలీ యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు, మధు, సురేష్, విష్ణు, కేశయాలు, మద్దిలేటి, పరమేష్ పాల్గొన్నారు. బేతంచెర్ల : బేతంచర్ల పట్టణం, ఆర్‌ఎస్ రంగాపురం, బలపాలపల్లి గ్రామాలలో అన్ని యూనియన్ల కార్యాలయాల ముందు నాయకులు ఎర్రజెండా ఆవిష్కరణ చేశారు. సిఐటియు జిల్లా నాయకులు వైబి వెంకటేశ్వర్లు, వై.ఎల్లయ్య మాట్లాడారు. వ్యకాసం జిల్లా అధ్యక్షులు ఆర్ ఈశ్వరయ్య, సిఐటియు మండల కార్యదర్శి ఎస్.రహంతుల్లా, అనుంబంధ సంఘాల నాయకులు బి.రామాంజనేయులు, ఎస్‌కే భాష, రమణ, రాజబాబు, నాగరాజు, వెంకటేశ్వర్లు, రంగాపురం మల్లికార్జున, తిమ్మయ్య, రాముడు, బాలయ్య, రషీద్, దస్తగిరి, అహ్మద్, మదార్‌వలి, వెంకటేష్ కుమార్, రామచంద్రుడు, జై శ్రీనివాసులు, నారాయణ, భాష, కోవెలకుంట్ల భాష, మహేష్ రెడ్డి, మద్దిలేటి, రాజు, కార్మికులు పాల్గొన్నారు. ప్యాపిలి : మండలంలోని జలదుర్గం గ్రామంలోని బస్టాండ్ ప్రాంతంలో సిఐటియు జెండాను అధ్యక్షులు హుస్సేన్ అధ్యక్షతన నాయకులు జెవి. శ్రీనివాసులు ఆవిష్కరించారు. పద్మశాలి శ్రీనివాసులు, మాసూం, నారాయణస్వామి, రఫీ, సుధాకర్, జె.శ్రీని, వై.సురేష్, షేక్షావలి, బసవరాజు, కేశవులు పాల్గొన్నారు. పాములపాడు : పాములపాడులో సిఐటియు మండల కార్యదర్శి పరమేశ్ జెండాను ఆవిష్కరించారు. కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమన్న, రైతు సంఘం కార్యదర్శి మండల వెంకటేశ్వరరావు మాట్లాడారు. సిఐటియు నాయకులు హనుమంతు, బ్రహ్మయ్య, వైఆర్‌డిఎస్ అధ్యక్షులు షర్ఫుద్దీన్ అలీ, రజక సంఘం అధ్యక్షులు రామకృష్ణ పాల్గొన్నారు.











