పేదలకు భోజనాలు అందజేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-కందుకూరు :ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ కందుకూరు వారి ఆధ్వర్యంలో దాతల సహాయంతో పేదలకోసం కందుకూరులో నిస్సహాయులైన వద్ధులను గుర్తించి వారికి భోజనాల ప్యాకెట్లు,అరటి పండ్లు అందజేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సాజిద్,ట్రజరర్ హఫీజ్, ఇన్‌ఛార్జి అయూబ్ ఖాన్ పఠాన్ షంషఉద్దీన్ పాల్గొన్నారు.
పేదవారి ఆకలి తీర్చే దిశగా శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు వారి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా శనివారం గుర్రం సింగయ్య గుప్తా,నిర్మలాదేవి వివాహ వార్షికోత్సవం సందర్భంగా కందుకూరు పట్టణం కోవూరు రోడ్డులో ఉన్న స్వర్ణ స్వయంకషి మానసిక వికలాంగుల ఆశ్రమంలో పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. గుర్రం సింగయ్య గుప్తా,నిర్మలాదేవి ఉన్నారు.










