May 10,2023 16:02

ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్ : మచిలీపట్నం మండలం మంగినపూడి గ్రామంలో జరుగుచున్న ఉపాధి హామీ పనులను బుధవారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి కూలీలను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు చౌటపల్లి రవి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉపాధి కూలీని 600 రూపాయలకు పెంచాలని, ఉపాధి పనులు 200 రోజులు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా ఉపాధి చట్టాన్ని దెబ్బతీసే విధంగా బడ్జెట్లో కోతలు విధిస్తుందని అన్నారు. 2020 -21 సంవత్సరంలో ఏడు కోట్ల 55 లక్షల కుటుంబాలు ఉపాధి పనులు చేయగా 2022  23 సంవత్సరాలకి ఒక కోటి 36 లక్షల కుటుంబాలకు తగ్గిపోవటం జరిగిందని కేంద్ర ప్రభుత్వం భూస్వాములకు పెట్టుబడిదారులకు దోసిపెట్టడానికి ఒక పథకం ప్రకారం చేస్తున్న దుర్మార్గపు చర్య అని అన్నారు. కాబట్టి  ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ ఉపాధి పనులకు 600 రూపాయలు వేతనం ఇవ్వాలని రెండు వందల రోజులు పనులు కల్పించాలని డిమాండ్ చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి మాదాల వెంకటేశ్వరరావు, జిల్లా కోశాధికారి బి సుబ్రహ్మణ్యం, సీఐటీయూ మచిలీపట్నం మండల కార్యదర్శి సిహెచ్ జయరావు పాల్గొన్నారు.