అవగాహన కల్పిస్తున్న అధికారులు
ప్రజాశక్తి-హిందూపురం : పరిశ్రమల్లో సంభవించే అగ్ని ప్రమాదాలపై కార్మికులకు అగ్నిమాపక అధికారి ప్రభాకర్ ఆధ్వర్యంలో మంగళవారం లేపాక్షి సమీపంలో ఉన్నా సర్‌డెనీమ్ ప్రవేట్ లిమిటెడ్ పరిశ్రమలో అవగాహన కార్య క్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు, సిబ్బందికి అగ్ని ప్రమాదాలపై వివరిస్తూ అగ్ని నిరోధక పరికరాల గురించి వివరించారు. పరిశ్రమలో పెద్ద ప్రమాదాలు సంభవిస్తే మోటార్లు, ఇతర ఫైర్ ఎక్యువ్‌మెంట్ సహాయంతో మంటలు ఏవిదంగా ఆర్పవచ్చో వివరించారు. ప్రమాదాలు జరిగినప్పుడు సురక్షితంగా బయటకు వెళ్లు విధానాలు తనతోటి వారు గాయపడినప్పుడు వారిని ఏవిదంగా బయటికు తీసుకెల్లే విధానం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, కార్మికులు, పరిశ్రమ సిబ్బంది పాల్గొన్నారు.










