Sep 07,2023 22:04

న్యూఢిల్లీ :  సూర్యునిపై పరిశోధన కోసం భారత్‌ ప్రయోగించిన ప్రతిష్టాత్మకమైన అంతరిక్ష మిషన్‌ 'ఆదిత్య ఎల్‌1' సెల్ఫీని తీసుకుంది. అలాగే భూమి, చంద్రుని ఫొటోలను కూడా తీసినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గురువారం తెలిపింది. భూమి, చంద్రుడు , ఆదిత్య ఎల్‌1 ఈ మూడు ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటోలను ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేసింది. భూమి నుండి 1.5 మిలియన్‌ కి.మీ దూరంలో ఉన్న తన గమ్యస్థానమైన లాంగ్రేగియన్‌ పాయింట్‌కు చేరుకునే క్రమంలో ఈ ఫొటోలను తీసినట్లు తెలిపింది. 

 

Aditya-L1 Mission:
👀Onlooker!

Aditya-L1,
destined for the Sun-Earth L1 point,
takes a selfie and
images of the Earth and the Moon.#AdityaL1 pic.twitter.com/54KxrfYSwy