పుట్టపర్తి అర్బన్ : జిల్లాలోని అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాను అభివద్ధి పథంలో నడిపించాలని, విధులపై నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని కలెక్టర్ అరుణ్‌బాబు హెచ్చరించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, డిఆర్‌ఒ కొండయ్య, డిప్యూటీ కలెక్టర్లు మధులత, భవానీశంకర్, ఆర్డీవోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్డీవోలు, తహశీల్దార్లు అభివద్ధి పనులపై సమీక్ష నిర్వహించాలన్నారు. అధికారులు అందరూ శ్రద్ధ పెట్టి పని చేయాలన్నారు. రెవెన్యూ, గహ నిర్మాణం, ఐసిడిఎస్, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు, ఉపాధి హామీ తదితర అభివద్ధి పనులను అధికారులందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా, సంబంధిత హెచ్‌ఒడిలతో సంప్రదించి పరిష్కరించాలన్నారు. భూసర్వే పనులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. భూ వివాదాలను పరిష్కరించడమనేది సర్వే ప్రధాన ఉద్ధేశమన్నారు. రీ సర్వే పక్కాగా చేయకపోతే రెండవసారి చేయాల్సి వస్తుందన్నారు. ఆధునిక పరిజ్ఞానంతో చేపట్టిన రీ సర్వే పూర్తి అయిన గ్రామాల్లో రాళ్లు నాటే కార్యక్రమం వేగవంతం చేయాలన్నారు. మొదటి సర్వే బాగా చేశారని రెండవ దశ రీ సర్వే కూడా బాధ్యతగా చేయాలన్నారు. మే 5వ తేదీకి రాళ్లు పాతి పెట్టె పనులు పూర్తి చేయాలన్నారు. వసతి గహాల్లో పిల్లల ఆరోగ్యం పట్ల సాంఘిక సంక్షేమ శాఖ డిడిలు పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రాధాన్యత భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రస్తుతం ఉపాధి కూలీలు 65 వేల మంది కూలీలు పనిచేస్తున్నారని, ఆ సంఖ్య లక్షకు చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అంగనవాడీ కేంద్రాలను సిడిపిఒలు, సూపర్‌వైజర్లు పర్యవేక్షించాలన్నారు. నాడు-నేడు పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు భాగ్యరేఖ, తిప్పేంద్ర నాయక్, సిపిఒ విజరు కుమార్, గహ నిర్మాణ శాఖ పీడీ చంద్రమౌళి రెడ్డి, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ రషీద్ ఖాన్, డిపిఒ విజరు కుమార్ రెడ్డి, డిఎంహెచ్‌ఒ కష్ణారెడ్డి, డిఈఒ మీనాక్షి, భూమి సర్వే ఏడీ రామకష్ణ, డ్వామా పీడీ రామాంజనేయులు, సాంఘిక సంక్షేమ డిడి శివరంగ ప్రసాద్, పిఆర్ ఎస్‌ఇ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.










