అధికారులు హాజరు కాకపోతే ఎలా?
మండల సమావేశంలో ఎంపిపి అసహనం
ప్రజాశక్తి - పగిడ్యాల
మండల సమావేశానికి మండలంలోని ఆయా శాఖ అధికారులు హాజరు కాకపోతే ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ఎంపీపీ మండ్ల మల్లేశ్వరి అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ మండ్ల మల్లేశ్వరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. గత మండల సర్వసభ్య సమావేశంలో అధికారులు అందరూ హాజరుకావాలని ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారులు సక్రమంగా హాజర్ కాకపోతే ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని మండిపడ్డారు. మైనార్టీ కాలనీలో గత వారం రోజుల నుంచి నీటి సరఫరా కావడం లేదని కో ఆప్షన్ సభ్యుడు అస్లాం బాష సభ దృష్టికి తీసుకొచ్చాడు. రెండు రోజుల్లో నీటి సమస్యను పరిష్కా రం చేస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఇ శివకుమార్ సమాధానం ఇచ్చారు. ఎంతో కష్టపడి నిరుపేదలకు ఇండ్ల పట్టాలు ఇప్పిస్తే ఇండ్ల పట్టాలు ఇప్పిస్తే వారు ఇండ్లు నిర్మించుకుంటున్నారని ఇల్లు నిర్మించుకున్న వారికి సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని ఎంపీపీ ప్రశ్నించారు. ఇండ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నామని హౌసింగ్ ఏఈ జ్యోతి సమాధానం ఇచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద మండలానికి 76 ఎకరాల పండ్ల పూల తోటలు పెంపకం కోసం టార్గెట్ ఇచ్చిందన్నారు. పండ్ల పూల తోటలో పెంపకం కోసం రైతులకు అవగాహన కల్పించే విధంగా ప్రజా ప్రతినిధులు సహకరించాలని ఏపీఓ మద్దిలేటి కోరారు. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అందుకు సర్పంచులు ఎంపిటిసిలు సహకరించి బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని ఎంఈఓ సుభాన్ కోరారు. ఎంపీడీవో వెంకటరమణ మాట్లాడుతూ సమావేశానికి హాజరైన అధికారులపై జిల్లా ఉన్నత అధికారు లకు ఫిర్యాదు చేస్తానన్నారు. ప్రతి మండల సర్వసభ సమావేశానికి ఎంత పని ఉన్న అధికారులు తప్పకుండా హాజరు కవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.










