Aug 30,2023 23:04

 సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌. రఘు
ప్రజాశక్తి - మొవ్వ :
ప్రజా సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన సమరభేరి కార్యక్రమాన్ని బుధవారం మొవ్వ మండలంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఆర్‌.రఘు ప్రారంభించారు. ఈ మేరకు మొవ్వ సెంటర్లో సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్‌ ఆవిష్కరణ, ప్రజలకు కరపత్రాల పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆర్‌. రఘు మాట్లాడుతూ. రోజురోజుకీ నిత్యవసర ధరలు హద్దు అదుపు లేకుండా ఆకాశాన్నంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలు మధ్యతరగతి ప్రజానికం అధిక ధరల కోరల్లో చిక్కుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ గద్దె ఎక్కిన వెంటనే 450 రూపాయలు ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర నేడు 1200 రూపాయలకు పెరిగిందని, పెట్రోల్‌ డీజిల్‌ చార్జీలు అంతులేకుండా పెరుగుతూనే ఉన్నాయన్నారు. కూరగాయల ధరలు ఊహించనంతగా ఈ నెలలో 37 శాతం పెరిగాయని, పప్పులు 45 శాతం పెరిగాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు కలిసి ప్రజల నెత్తిపై మోయలేని భారం మోపుతు న్నాయన్నారు. ఈ కార్యక్రమంలో శీలం నారాయణరావు, పార్టీ మండల కార్యదర్శి బొల్లా సుబ్రహ్మణ్యం, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సిహెచ్‌ బసవపూర్ణ, సిఐటియు మండల కార్యదర్శి .కె రాజశేఖర్‌, పంచాయతీ కార్మికులు ప్రసాద్‌, పార్టీ కార్యకర్తలు. లాజరు,వి వెంకటేశ్వర్లు, కే వెంకటేశ్వ రరావు. కే జలచంద్రులు తదితరులు పాల్గొన్నారు.