Sep 01,2023 19:39

ఆదోనిలో వినతిపత్రం ఇస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
అధిక ధరలు, విద్యుత్‌ చార్జీలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో పట్టణంలోని ఆయా సచివాలయాల కార్యదర్శులకు శుక్రవారం ఓ ఉద్యమంలా వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, కార్యదర్శివర్గ సభ్యులు గోపాల్‌, ముక్కన్న, పట్టణ కమిటీ నాయకులు వీరేష్‌, కృష్ణమూర్తి, నాగేంద్ర, శ్రీనివాసులు, నాగరాజు, ఇక్బాల్‌ మాట్లాడారు. గతంలో రూ.450 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర నేడు భారీగా పెరిగిందని తెలిపారు. విద్యుత్‌ చార్జీల నుంచి నిత్యావసర ధరలు ఆకాశన్నంటాయన్నారు. పరిస్థితి మారాలంటే ప్రజలు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని కోరారు. నాగరాజు, గౌస్‌, మల్లయ్య, ఉరుకుందు, హరి, మహ్మద్‌, అంజిని, కాలనీవాసులు పాల్గొన్నారు.