బోల్తా పడిన ప్రయివేట్ స్కూల్ బస్
ప్రజాశక్తి - కోసిగి
మంత్రాలయం శ్రీవైష్ణవి స్కూల్‌కు చెందిన బస్సు బోల్తా పడిన సంఘటన సాతునూర్ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడిన వెంటనే స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం విద్యార్థుల కోసం సాతునూర్ గ్రామానికి వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ వెంకటేష్‌కు స్వల్ప గాయాలయ్యాయని సమాచారం.










