ఆదర్శప్రాయుడు మోహనరావు
ప్రజాశక్తి-ఉయ్యూరు
సోషలిజం ద్వారా సమసమాజం ఏర్పడుతుందని తను నమ్మిన సిద్ధాంతం కోసం తుదిశ్వాస విడిచే వరకూ పోరాడిన కాటూరు మోహనరావు ఆదర్శ కమ్యూనిస్టు నాయకుడు అని సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు వీరమాచినేని జ్యోతి అన్నారు. ఉయ్యూరులోని సిపిఎం కార్యాలయంలో కీర్త్తిశేషులు కాటూరు మోహనరావు వర్థంతి సభ మంగళవారం జరిగింది. ఆయన చిత్రపటానికి జ్యోతి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ మోహనరావు పేదలు, ఉపాధి కూలీలు, రైతులు, కౌలు రైతులు తదితరుల సమస్యలపై జరిగిన పోరాటాల్లో పాల్గొన్నారని గుర్తుచేశారు. సభకు కొడాలి ఏసు పాదం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఉయ్యూరు పట్టణ కార్యదర్శి బి.రాజేష్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పవన్ కుమార్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు కె.కొండలబాబు, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి తెల్లాకుల బాజీ బాబు, సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు పడాల లక్ష్మణరావు, బి.కీర్తి, కలపాల రవి, మోహన్ రావు పెద్ద కుమారుడు, జాన్ వెస్లీ మనవడు సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు.










