ఆదర్శప్రాయుడు భగత్ సింగ్
ప్రజాశక్తి-యంత్రాంగం
సర్దార్ భగత్ సింగ్ 92వ వర్థంతి కార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా గురువారం జరిగాయి. ఆయన చిత్ర పటానికి పలువురు సిపిఎం, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఐసిఇయు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కలెక్టరేట్ (కష్ణా) : ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్థంతిని పురస్కరించుకుని స్థానిక ఎల్ ఐ సి డివిజనల్ కార్యాలయం ముందు గురువారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి ఘనమైన నివాళి అర్పించారు. ఐసిఇయు ప్రధాన కార్యదర్శి జి.కిషోర్ కుమార్ మాట్లాడారు. చిరుప్రాయంలోనే బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలర్పించిన మహాయోధుడు భగత్ సింగ్ అని కొనియాడారు. రాజకీయ స్వాతంత్య్రమే కాకుండా దేశానికి ఆర్థిక స్వాతంత్య్రం కావాలని పరితపించారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్యాండిల్ లైట్ ప్రదర్శనలో ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొని నివాళులర్పించారు. జె. సుధాకర్, జి. కిషోర్ కుమార్, ఎల్. రాజశేఖర్, వి.ఆర్.ఎన్. ఠాగూర్, ఎస్.వి. రత్నారావు, ఎ. శ్రీనివాసరావు, బిహెచ్. మాధుర్, వై, స్వామినాథ్ తదితరులు నాయకత్వం వహించారు. వివిధ తరగతుల ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బంటుమిల్లి : స్థానిక గుండాబత్తుల ఆంజనేయులు భవనంలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. అజరు ఘోష్, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొల్లాటి శ్రీనివాసరావు, సిపిఎం మండల కార్యదర్శి మాజేటి శివ శ్రీనివాసరావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కొమ్మలపాటి రవి, వై.శ్రీనివాసరావు, కలతూరి చిట్టిబాబు తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. గుడివాడ : స్థానిక సుందరయ్య భవనంలో భగత్ సింగ్, సుఖదేవ్ వర్థంతులను నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సమరం మాట్లాడారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ సి పి రెడ్డి, సమీర్ సలీం, ఆర్ కొండ, పి రజిని, ఎండి హఫీజా తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ (కృష్ణా) : డివైఎఫ్‌ఐ మచిలీపట్నం కమిటీ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు కీర్తి అధ్యక్షతన గురువారం మచిలీపట్నంలో సర్దార్ భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ 92వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. డివైఎఫ్‌ఐ కష్ణా జిల్లా కన్వీనర్ తెల్లాకుల బాజీ బాబు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. మచిలీపట్నంటౌన్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు సిహెచ్ శ్రీనివాస్, టి గోవిందు, అఖిల్, పి రాజేష్, బూరా అక్షరు, సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు బూర. సుబ్రహ్మణ్యం, సిహెచ్ జయరావు, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ రాజేష్, ఆవాజ్ నాయకులు ఎండి యూనస్ తదితరులు పాల్గొన్నారు.










