మడకశిర రూరల్ : జ్యోతిరావుపూలే ఆదర్శనీయుడని పలువురు వక్తలు అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి పురస్కరించుకొని స్తానిక ఉపాధ్యాయులు ఆదినారాయణ దంపతులు మంగళవారం సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలను ఈ దంపతులు చేపడుతుండటంపై స్థానికులు అభినందిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం పట్టణంలోని అమరాపురం బస్టాండ్ వద్ద మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఉపాధ్యాయులతో కలిసి ఆదినారాయణ దంపతులు ఘనంగా నిర్వహించారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రతి సంవత్సరం మాదిరిగానే అమిదాలగొంది గ్రామ సమీపంలోనిశ్రీ వెంకటేశ్వర వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు ఆదినారాయణ మాలతి మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే చేసిన సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తిప్పేస్వామి నాగవర్దన్ ముర్తి తదితరులు పాల్గొన్నారు
కదిరి అర్బన్ : స్థానిక పూలే సర్కిల్ నందు మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిర్వహించిన పూలే జయంతి ఉత్సవాలలో కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెనుకబడినవర్గాల హక్కుల సాధన కోసం జ్యోతిరావుపూలే చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ : పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పూలే చిత్రపటానికి ఎమ్మెల్యే పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ ఛైర్మన్‌ఉమర్ ఫరూక్, వైస్ ఛైర్మన్లు జయశంకర్ రెడ్డి, సునీల్, ఎంపిపి గీతా రామ్మోహన్ రెడ్డి, వైసిపి నాయకులు పొగాకు రాంచంద్ర, మండల కన్వీనర్ నాగలూరు బాబు, టౌన్ కన్వీనర్ శ్రీరాములు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ : పట్టణంలోని టిడిపి కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు రవిశంకర్, జిల్లా టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మునిమడుగు వెంకటరాముడు, జిల్లా అధికార ప్రతినిధి రఘువీర్ చౌదరి, టిఎన్‌టియుసి రాష్ట్ర కార్యదర్శి పాలడుగు చంద్ర, జిల్లా ఆఫీసు సెక్రటరీ సాయి ప్రసాద్, అంగన్వాడీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణి, ముస్లిం మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అత్తర్ ఖదీర్, మాజీ సర్పంచ్ సుబ్బరాయుడు, మండల ఉపాధ్యక్షులు బోయ నాగరాజు, పట్టణ మహిళా అధ్యక్షురాలు గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
మడకశిర అంటరానితనాన్ని , అసమానతలను ఎండగట్టిన తొలి తరం సాంఘిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని యుటిఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు బూతన్న అన్నారు. యుటిఎఫ్ ఆధ్వర్యంలో పట్టణం లోని అమరాపురం బస్టాండు నందు గల జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాలింగప్ప, మూడ్ల గిరియప్ప ,ఉపాధ్యక్షులు వై.జోగప్ప, అధ్యక్షులు నరశింహప్ప, దత్తాత్రేయ, ఓబన్న, దేవరాజు, శివన్న, గంగులప్ప, పవన్ కుమార్, సురేష్, నాగరాజు, శ్రీనివాసులు, సూర్య ప్రకాష్, రామాంజప్ప తదితరులు పాల్గొన్నారు.
బుక్కపట్నం : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మయ్య తెలిపారు. జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రవికుమార్, అధ్యాపకులు వెంకటేశ్వర ప్రసాద్, ఆదినారాయణ, చంద్రమోహన్, ఓబయ్య, నాగేంద్ర, వెంకటకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
మడకశిర : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీనజన బాంధవుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పే స్వామి అన్నారు. పూలే జయంతిని పురస్కరించుకుని పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, పట్టణ అధ్యక్షుడు మనోహర్, మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఓబుల దేవర చెరువు : మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని స్థానిక శివాలయం వీధిలో బిసి హక్కుల పోరాట సమితి పుట్టపర్తి నియోజకవర్గ అధ్యక్షులు షబ్బీర్ అధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రహంతుల్లా,వెంకటరమణప్ప, అక్కులప్ప, బాబా,దొడెప్ప, తదితరులు పాల్గొన్నారు. అలాగే కొండకమర్ల ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘనాయకులు గౌస్ లాజమ్, ఉపాధ్యాయులు రామకృష్ణ, నాగరాజు, వెంకట చలమయ్య, చంద్రకళ, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్ : ఆదర్శ నీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని టిడిపి నాయకులు పేర్కొన్నారు.మంగళవారం పట్టణంలోని ఇందిరా గాంధీ సర్కిల్ వద్ద టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి పురస్కరించుకొని నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మోపూరి చంద్రశేఖర్ , పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, నల్లచెరువు కన్వీనర్ రాజశేఖర్, బీసీ సెల్ అధ్యక్షులు నాగప్ప, ఎస్సీ సెల్ నియోజవర్గ అధ్యక్షులు విశ్వనాథ్, బిఎస్‌ఎన్‌ఎల్ భాస్కర, ఖాదర్ బాషా, శేషు, మందాల గోపాల్ రాజేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : ఆదర్శనీయుడు జ్యోతిరావ్‌పూలే అని మహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. పూలే జయంతిని పురస్కరించుకుని వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల వారు మంగళవారం పట్టణంలోని సూగూరుా అంజినేయ ఆలయ సమీపం వద్ద ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. వైసిపి ఆధ్వర్యంలో పలు సచివాలయాల్లో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇంద్రజ, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు లోకేష్, పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. టిడిపి ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అంబికాలక్ష్మినారాయణ, పట్టణ అధ్యక్షుడు రమేష్ కుమార్, సీనియర్ నాయకులు అమర్నాథ్, బేవినహళ్లి ఆనంద్, మాజీ సర్పంచి రాము, కౌన్సిలర్ రాఘవేంద్ర, మైనార్టీ, తెలుగు యువత, తెలుగు మహిళా అధ్యక్షులు హిదాయత్, సురేష్ నాయక్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










