చోరీ జరిగిన దుకాణం
ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలోని షరాఫ్ బజారులో ఉన్న షాపులో పట్టపగలే చోరీ జరిగినట్లు యజమాని ముఖేష్ శనివారం తెలిపారు. నిందితుడు అడిగిన వెండి ఉంగరం కోసం పక్క షాపునకు వెళ్లి తన తమ్ముడు పంకజ్ తెచ్చేలోగా షోకేజ్‌లోని బంగారు ఆభరణాల బాక్సులను తీసుకెళ్లినట్లు తెలిపారు. 1వ పట్టణ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు. గతేడాది ఈ దుకాణం పక్కనే ఉన్న షాపులో జరిగిన చోరీ సొత్తును పోలీసులు రికవరీ చేసిన విషయం విదితమే. అదే తరహాలోనే చోరీ జరగడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.










