Aug 18,2023 19:29

మద్యం, నిందితుని చూపుతున్న పోలీసులు

ప్రజాశక్తి - ఆదోని
ఆదోని పట్టణం డంప్‌ యార్డు సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 18 కర్ణాటక మద్యం బాక్సులు, ఒక స్కూటర్‌ను సెబ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెబ్‌ ఇన్‌స్పెక్టర్‌ హరికృష్ణ వివరాల మేరకు... శుక్రవారం ఉదయం పట్టణానికి చెందిన బోయ సూర్య, బోయ నీలకంఠ, దుబ్బ నరసింహులు ఒక మోటారు సైకిల్‌పై 18 కర్ణాటక మద్యం బాక్సులు రవాణా చేస్తుండగా గుర్తించి, ఇద్దరిని అరెస్టు చేయగా నరసింహులు పారిపాయినట్లు తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు 18 మద్యం బాక్సులు, ఒక స్కూటర్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎస్‌ఐలు మధుసూదన్‌ రెడ్డి, శివ, పిసిలు శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.