Oct 09,2023 16:55

ప్రజాశక్తి-ఆదోని: ఆదోని పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు సోమవారం ఎ సి బి డి.ఎస్.పి వెంకటాద్రి ఆధ్వర్యంలో అధికారుల బృందం దాడులు నిర్వహించారు మున్సిపల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు మహాలక్ష్మి చరణులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రెడ్యాండెడ్గా 10000 నగదు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా డిఎస్పి వెంకటాద్రి మాట్లాడారు ఆదోని పట్టణంలోని మున్సిపల్ ఆది ఆంధ్ర స్కూల్లో టీచర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు ఇటీవలనే సస్పెండ్ అయ్యారు నాన్ డ్రయల్ సర్టిఫికెట్ కోసం మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్లు చరణ్ మహాలక్ష్మి లు 30 వేలు డిమాండ్ చేసినట్లు శ్రీనివాసులు తమను సంప్రదించారన్నారు. పథకం ప్రకారం మొదటి విడతగా 5000 ఇవ్వగా సోమవారం మరో రూ 10,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నామన్నారు. ఎవరైనా లంచం అడిగినా ఇచ్చిన చట్టరీత్యానిరమన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 14400 కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.