బత్తలపల్లి :రాష్ట్రంలో మఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న అభివద్ధిని గమనించి మరోసారి ఓటేయ్యాలని రాష్ట్ర కురుబ కార్పొరేషన్ ఛైర్మన్ కోటి సూర్యప్రకాష్‌బాబు ప్రజలను కోరారు. మండల కేంద్రంలోని కోటి కాలనీ, గోవింద్ చౌదరి బిల్డింగ్ ఏరియా, పాత ఆసుపత్రి వెనుక, వినాయక నగర్, నీళ్లట్యాంక్ సమీపంలో మంగళవారం మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ఏరియాలోని ప్రతి ఇంటికీ వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తూ, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మేలు జరిగిందా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మేలు జరిగిందని భావిస్తే మరోసారి ముఖ్యమంత్రిగా జగన్‌కు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఇంటి యజమాని అనుమతితో ఇంటి తలుపులకు స్టిక్లర్లు, ఫోన్ నంబరు స్టిక్కర్ అంటించారు. అనంతరం మొబైల్ నంబరుకు వారి ద్వారా మిస్డ్ కాల్ ఇప్పించారు. ఈ కార్యక్రమంలో గహసారధులు, సచివాలయ కన్వీనర్లు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.










