అభివృద్ధికి ఆమాడ దూరంలో 'కొమరిక'
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : మండలంలోని కొమరిక గ్రామం అభివృద్ధికి ఆమాడ దూరంలో ఉందని కోవూరు టిడిపి ఇన్‌ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ప్రతి అడుగు ప్రజల కోసమే జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని గిరిజన కాలనీలను ఆయన సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొమరిక గ్రామానికి ఏ అభివృద్ధి పని చేయలేదని తెలిపారు. కనీసం ఒక్కసారి కూడా కొమరిక గ్రామాన్ని సందర్శించిన దాఖలాలూ లేవని తెలిపారు. గ్రామంలో డ్రెయినేజీ వ్యవస్థ పూర్తి అధ్వానంగా ఉందని గిరిజన కాలనీవాసులు దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. ప్రజలందరూ ముక్తకంఠంతో తమని తమ పార్టీని గెలిపిస్తామని అన్నారని తెలిపారు. చంద్రబాబునాయుడు అరెస్టుపై ప్రజలందరూ తీవ్ర అసంతృప్తి చెందుతున్నారని, వైసిపి పతనం ఖాయమని జోస్యం పలికారు. కక్షలతో ప్రజల మనసును గెలవలేరని, అభివృద్ధితో మనసును గెలవాలన్నారు. తప్పుడు కేసులతో తమ నాయకులను అనుచరులను భయపెట్టలేరని హెచ్చరించారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు రావెళ్ల వీరేంద్ర చౌదరి, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి చెంచు కిషోర్ బాబు, గ్రామ నాయకులు మనగశెట్టి మనోహర్, ఈదురు చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.










