Aug 15,2023 21:16

జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేస్తున్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అంజాద్‌ బాషా, జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌, ఎఎస్‌పి వెంకటరాముడు తదితరులు

అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత
- జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి
- జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అంజాద్‌ బాషా
- జిల్లా వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

       నంద్యాల జిల్లాలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులా భావించి, వేటినీ విస్మరించకుండా రెండిటికీ అధిక ప్రాధాన్యతనిస్తూ జిల్లా సమగ్రాభివృద్ధిలో ప్రభుత్వం కీలక భూమిక పోషిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి షేక్‌ అంజాద్‌ భాషా పేర్కొన్నారు. పురడు పోసుకున్న జిల్లా అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాల కృషి చాలా అవసరమని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అన్ని విద్యాసంస్థల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలో పిఎస్‌సి, కెవిఎస్‌సి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అత్యంత వేడుకగా, కన్నుల పండువగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా ముఖ్య అతిధిగా హాజరై జాతీయ పతాకావిష్కరణ గావించి రాష్ట్రీయ సెల్యూట్‌ చేశారు. ఈ సదర్భంగా జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌, ఎఎస్‌పి వెంకట రాముడులతో కలిసి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెరేడ్‌ మైదానాన్ని పరిశీలించారు. అనంతరం వివిధ ప్లాటూన్లు మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో పుట్టి పెరిగి ఈ ప్రాంత ప్రజల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తి కలిగించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గోసాయి వెంకన్న, వడ్డే ఓబన్న, నంద్యాల కాదర్‌ బాద్‌ నర్సింగరావు, ఆంధ్రతిలక్‌ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, యాళ్ళూరి స్వామిరెడ్డి, పెండేకంటి వెంకటసుబ్బయ్య, బివి సబ్బారెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, గామాగో వంటి మహనీయులందరికీ ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించాలన్నారు. ఉద్యాన పంటల అభివృద్ధిలో భాగంగా జిల్లాలో నూతనంగా పామ్‌ ఆయిల్‌ సాగు విస్తీర్ణం కోసం ఒక్కో రైతుకు ఒక హెక్టార్‌కి 71 వేల రూపాయల రాయితీతో వెయ్యి హెక్టార్లను లక్ష్యంగా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 5 వేల హెక్టార్లలో బిందు, తుంపర సేద్యం అమలు చేయడానికి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో 50 ఎకరాల విస్తీర్ణంలో రూ. 475 కోట్లతో నూతన మెడికల్‌ కళాశాల నిర్మాణం పనులు పూర్తి దశకు చేరుకున్నాయని చెప్పారు. శ్రీశైల జలాశయంలో నీటి లభ్యతను బట్టి ఈ ఏడాది కెసి కెనాల్‌ కింద 1 లక్షా 75 వేల 388 ఎకరాలకు, ఎస్‌ఆర్బిసి కాలువల ద్వారా 1 లక్ష 31 వేల 450 ఎకరాలకు, తెలుగు గంగ ప్రాజెక్టు కింద 1,01,600 ఎకరాలకు, సిద్దాపురం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా 4900 వేల ఎకరాలకు, 38 ఎత్తిపోతల పథకాల ద్వారా 38,647 ఎకరాలకు, శివభాష్యం ప్రాజెక్టు కింద 6 వేల ఎకరాలకు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కాలువ ద్వారా 43,304 ఎకరాలకు సాగునీటిని అందించనున్నామన్నారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన అధికారులకు, ఉద్యోగులకు అతిధులు ప్రశంషా పత్రాలు అందచేశారు. అంతకుముందు డిఆర్‌డిఎ, డ్వామా, ఎస్సీ కార్పొరేషన్‌, హౌసింగ్‌, వ్యవసాయం, స్త్రీ సంక్షేమ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, గిరిజన సంక్షేమం, వైద్య ఆరోగ్యం, ఉద్యాన, రవాణా, సూక్ష్మ సేద్యం, సివిల్‌ సప్లైస్‌, అగ్నిమాపక తదితర శకటాలను ప్రదర్శించారు. అలాగే సంబంధిత శాఖలు ప్రదర్శించిన ఎక్సిబిషన్‌ స్టాళ్లను అతిధులు సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఉత్తమ సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించిన పాఠశాల విద్యార్థులకు, శకటాల ప్రదర్శనకు బహుమతులు అందచేశారు. ఈ వేడుకల్లో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్‌ బాషా, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, తోగూరు ఆర్థర్‌, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ పిపి నాగిరెడ్డి, జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్‌ వంగాల భరత్‌ కుమార్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మాబున్నిసా, డిఆర్‌ఒ పుల్లయ్య, పట్టణ ప్రముఖులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల : పట్టణంలోని సిపిఐ కార్యాలయం ఎదుట జాతీయ జెండాను రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు రామాంజనేయులు ఎగురవేశారు. జిల్లా కార్యదర్శి రంగనాయుడు పాల్గొన్నారు. అలాగే భగత్‌ సింగ్‌ లైబ్రరీ ట్రస్ట్‌ బోర్డు ఆధ్వర్యంలో జాతీయ జెండాను సీనియర్‌ నాయకులు గండు మాధవరావు ఎగురవేశారు. భగత్‌ సింగ్‌ విగ్రహానికి విశ్రాంత ఎస్‌ ఐ సుబ్బయ్య పూలమాల వేశారు. సుఖదేవ్‌ విగ్రహానికి విశ్రాంత ఉపాధ్యాయులు కేశవరెడ్డి, రాజగురు విగ్రహానికి సింహాద్రి రామ్మూర్తి పూలమాల వేసి నివాళి అర్పించారు. ట్రస్ట్‌ సభ్యులు మాదాల శ్రీనివాసులు, డాక్టర్‌ నాగరాజు, ప్రముఖ న్యాయవాది పి.శ్రీనివాసులు, న్యాయవాది జివి రమణ, డాక్టర్‌ రామకృష్ణ రెడ్డి, తోట మద్దులు, భాస్కర్‌, నారాయణ, సీనియర్‌ పాత్రికేయులు పాశం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల లీగల్‌ : స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో అడ్వకేట్స్‌కు నిర్వహించిన ఆటలపోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తతీయ ప్రైజ్‌లు మూడవ అదనపు జిల్లా జడ్జి వాసు, రెండవ అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి కిరణ్‌ కుమార్‌లు ప్రదానం చేశారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కానాల విజయ శేఖర్‌ రెడ్డి, జాయింట్‌ సెక్రెటరీ డి.ప్రతాప్‌ రెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌ రఘు ప్రకాష్‌, స్పోర్ట్స్‌ సెక్రటరీ ప్రసాద్‌ రెడ్డి, జాయింట్‌ సెక్రటరీ యాగంటి పల్లె మద్దిలేటి యాదవ్‌, ట్రెజరర్‌ ఖాద్రి, లైబ్రరీ నందం బాబురావు, మహిళా రిప్రజెంటెడ్‌ రాజేశ్వరి, న్యాయవాదులు పాల్గొన్నారు. అవుకు మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహానికి ఎంపీపీ చల్లా రాజశేఖర్‌ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పోలీస్స్టేషన్లో ఎస్‌ఐ నరేంద్ర జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. నంద్యాల రూరల్‌ : మాస్టర్‌ పబ్లిక్‌ స్కూల్లో 2వ వార్డ్‌ కౌన్సిలర్‌ సాదిక్‌ భాష, స్కూల్‌ డైరెక్టర్‌ దస్తగిరి పర్ల జెండా ఆవిష్కరణ చేశారు. స్కూల్‌ కరస్పాండెంట్‌ హలీమా, విద్యార్థులు పాల్గొన్నారు. బనగానపల్లె : పట్టణంలోని జూనియర్‌ సివిల్‌ జడ్జి మెజిస్ట్రేట్‌ కోర్టులో జడ్జి కిషోర్‌ కుమార్‌, జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో వైసిపి నాయకులు కాటసాని ఓబుల్‌ రెడ్డి, ప్రభుత్వ కార్యాలయాల్లో తహశీల్దార్‌ వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ మండల అధికారి సుబ్బారెడ్డి, డిఈ నాగ శ్రీనివాసులు, డిఈ ఉమాకాంత్‌ రెడ్డి, సిఐ తిమ్మారెడ్డి, ఎస్‌ఐ రామిరెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ గరుడ దీవెనమ్మ, కార్యదర్శి సుందర్‌ రాజు, వైస్‌ చైర్మన్‌ సన్నాల జనార్దన్‌ రెడ్డి, ఎంఇఒ స్వరూప, ఎంపిడిఒ మానసవీణ, మండల ఉపాధ్యక్షురాలు లక్ష్మీదేవి, సర్పంచ్‌ ఈసారి ఎల్లమ్మ, ఈవో ఖలీల్‌, పోస్ట్మాస్టర్‌ మురళీకృష్ణ, వాణిజ్య విభాగం కార్యాలయంలో టిడిపి వానిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు టంగుటూరి శీనయ్య జాతీయ జెండాను ఎగరవేశారు. సంజామల : మండల పరిషత్‌ కార్యాలయంలో మండలాధ్యక్షురాలు పోచ రమాదేవి, కోఆపరేటివ్‌ సొసైటీ బ్యాంకులో కెడిసిసి డైరెక్టర్‌ గుండం సూర్యప్రకాశ్‌ రెడ్డి, పోలీస్‌ స్టేషన్లో ఎస్సై ప్రతాప్‌, తహశీల్దార్‌ కార్యాలయంలో తహసిల్దార్‌ మల్లికార్జున రావులు జెండాను ఎగురవేశారు. మహానంది : మండలంలోని తహశీల్దార్‌, ఎంపీడీవో, పోలీస్‌ స్టేషన్‌, మహానంది దేవస్థానం కార్యాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ జెండాను అధికారులు ఎగురవేశారు. ఆళ్లగడ్డ : మున్సిపల్‌ కార్యాలయ ఆవరణంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి జెండా ఎగురవేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌ బాబు, వైస్‌ చైర్మన్‌ నాయబ్‌ రసూల్‌ పాల్గొన్నారు. తహశీల్దార్‌ హరినాథ్‌ రావు, డీఎస్పీ వెంకటరామయ్య, సిఐ రమేష్‌ బాబు, ఎంపీడీవో మహబూబ్‌ ఖాన్‌, గ్రంధాలయ అధికారి అరుణ కుమారి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు గంధం రాఘవరెడ్డి, నరహరిలు వారి కార్యాలయాల్లో, ఎస్‌.లింగందిన్నెలో సర్పంచ్‌ ఇరిగెల విశ్వనాథరెడ్డిలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే పట్టణంలోని కెవి సుబ్బారెడ్డి ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో హెచ్‌ఎం ఓబన్న, కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి శంసుల్‌ హక్‌, ఆళ్లగడ్డ మండల అధ్యక్షులు బరగొడ్ల హుస్సేన్‌ భాష, ఆళ్లగడ్డ కోఆర్డినేటర్లు చాకలి పుల్లయ్య, గంధం మల్లేశ్వర్‌ రెడ్డి, జనసేన పార్టీ కార్యాలయంలో తాలూకా నాయకులు మైలేరి మల్లయ్య, మాజీ సైనిక కార్యాలయంలో న్యాయవాది ఆవుల విజయభాస్కర్‌ రెడ్డి, కేపిజి, హెచ్‌పిఏం పాఠశాలలో ప్రైవేట్‌ పాఠశాలల సంఘం అధ్యక్షులు అమీర్‌ భాష జెండాను ఆవిష్కరించారు. రుద్రవరం : మండలం కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో, పాఠశాలల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దారు రవీంద్ర ప్రసాద్‌, ఎంపిపి బాలస్వామి, జడ్‌పిటిసి మాధవి, ఎస్సై శరత్‌ కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బనగానపల్లె రూరల్‌ : మండలంలోని పలుకూరులో వైసిపి రాష్ట్ర కార్యదర్శి గుండం శేషి రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్‌ జిల్లెల్ల రామేశ్వర రెడ్డి, నందివర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై రామాంజనేయరెడ్డి, యాగంటి పల్లెలో యాగంటి దేవస్థానం మాజీ చైర్మన్‌ దొనపాటి యాగంటి రెడ్డి, సర్పంచ్‌ బండి వరలక్ష్మి, పాతపాడులో సర్పంచ్‌ బెడదల మహేశ్వరరెడ్డిలు జాతీయ జెండా ఎగరవేశారు. శ్రీశైలం : శ్రీశైలంలోని దేవస్థానం పరిపాలన భవనం ప్రాంగణంలో ఇఒ లవన్న, అని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.ఆత్మకూర్‌ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద చైర్మన్‌ డాక్టర్‌ ఆసియా జెండా ఎగురవేశారు.కమిషనర్‌ శ్రీనివాస్‌ రావు కోఆప్షన్‌ సభ్యుడు ఎంఏ రషీద్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు. జడ్పిటిసి శివశంకర్‌ రెడ్డి, ఎంపీడీవో మోహన్‌ కుమార్‌, ఏవో విష్ణువర్ధన్‌ రెడ్డి, తహశీల్దార్‌ ఉమాదేవి, డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీవో దాసు, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ బాలస్వామి, సింగిల్‌ విండో కార్యాలయం కార్యక్రమంలో చైర్మన్‌ సురేష్‌, వైసిపి పట్టణ అధ్యక్షుడు సయ్యద్‌ మీర్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం నాగరాజు, నారాయణ హైస్కూల్‌ కరస్పాండెంట్‌ జి.రాజశేఖర్‌, పద్మావతి హైస్కూల్‌లో డైరెక్టర్‌ ఆశ, నలంద హైస్కూల్‌ నందు కరస్పాండెంట్‌ జాతీయ జెండా ఎగరేశారు. పాములపాడు: తహశీల్దార్‌ కార్యాలయం నందు తాసిల్దార్‌ రత్న రాధిక, ఎంపీడీవో కార్యాలయం నందు ఎంపీపీ సరోజినీ వర్జినియ జెండాను ఎగరవేశారు. మద్దూర్‌ సొసైటీ నందు చైర్మన్‌ కృష్ణారెడ్డి వేంపెంట సొసైటీ నందు చైర్మన్‌ పెద్ద వెంకటస్వామి, ఆయా గ్రామాలలో సర్పంచులు కృష్ణ వేణి, ఆవుల జయసుధ, మాణిక్యమ్మ, మేకల భాగ్యమ్మ ,నాయని సావిత్ర మ్మ, అత్తరునిస్తా, మంగమ్మ బారు, రామస్వామి ,వరప్రసాదరావు, చంద్రారెడ్డి, బాల మల్లేశ్వర్‌ రెడ్డి, లత సచివాలయాలలో జెండాను ఎగరవేశారు. పగిడ్యాల : మండలంలో జడ్పిటిసి పుల్యాల దివ్య, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గంగిరెడ్డి గారి రమాదేవి, ఎంపీపీ మండ్ల మల్లేశ్వరి, మాజీ జెడ్పిటిసి పుల్యాల నాగిరెడ్డి, సర్పంచ్‌ పెరుమాళ్ళ శేషన్న, ఉపాధ్యాయులు విద్యార్థినిలు పాల్గొన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌ : ఐటిడిఏ, తహసీల్దార్‌, జలవనరుల శాఖ, అటవీశాఖ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ, ప్రవేట్‌ విద్య సంస్థల కార్యాలయాల్లో జాతీయ పతాకం ఎగురవేశారు. నందికొట్కూరు టౌన్‌ పట్టణంలో మున్సిపల్‌ చైర్మన్‌ దాసి సుధాకర్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ పి కిషోర్‌ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కోర్టు ఆవరణంలో.. సీనియర్‌ సివిల్‌ జడ్జి ప్రియదర్శి త్రివర్ణ పతాకం ఎగురవేశారు. జూపాడుబంగ్లా మండలంలోని పారుమంచాల గ్రామంలో సర్పంచ్‌ మాధవరం ప్రకాశం జెండా ఆవిష్కరించారు. డోన్‌లో పాతపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నందు హెచ్‌ఎం పద్మావతమ్మ అధ్యక్షతన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా డోన్‌ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి హాజరయ్యి జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే తెలుగు యువత ఆధ్వర్యంలో టిడిపి కార్యాలయంలో డోన్‌ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. డోన్‌ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కుమ్మరి సుధాకర్‌, డోన్‌ పట్టణ టిడిపి అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు, యువ నాయకులు గౌతమ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గీత యోగాసన సంఘం ఆధ్వర్యంలో యోగ గౌరవ అధ్యక్షులు సప్తశైల తిమ్మయ్య హాజరై జెండాను ఎగురవేశారు. కొత్తపల్లిలో ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కుసుమలత, జడ్పిటిసి సోముల సుధాకర్‌ రెడ్డి, తహశీల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్‌ పెద్దన్న, వైద్యశాలలో వైద్యాధికారి వినోద్‌ కుమార్‌, ఐకెపి కార్యాలయంలో ఏపిఎం పుల్లయ్య, ఎంఇఒ కార్యాలయంలో ఎంఈఓ శ్రీరాములు, పోలీస్‌ స్టేషన్లో ఏఎస్‌ఐలు బాబా ఫక్రుద్దీన్‌, వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ అధికారి మహేష్‌, నాగంపల్లి సొసైటీలో సొసైటీ చైర్మన్‌ గౌరు జనార్దన్‌ రెడ్డి, గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచు లక్ష్మీదేవి, శ్రీ రాజరాజేశ్వరి పాఠశాలలో కరస్పాండెంట్‌ వాసుదేవరెడ్డి, శ్రీసరస్వతి పాఠశాలలో కరస్పాండెంట్‌ మల్లయ్య, గ్రామాల్లో సర్పంచులు జెండా ఆవిష్కరణ చేశారు. చాగలమర్రిలో ఎస్‌ఐ రమణయ్య, తహసీల్దారు సుభద్రమ్మ, ఎంపిపి వీరభద్రుడు, జడ్‌పిటిసి లక్ష్మిదేవిలు జెండావిష్కరించారు. ముత్యాలపాడు గ్రామ సమీపంలో ఉన్న బర్డ్స్‌ ఉన్నత పాఠశాలలో కరస్పాండెంట్‌ పాల్‌ రాజారావు,హెచ్‌ఎం సింధూర లు జాతీయ జెండాను ఎగుర వేసి, 400 మీటర్ల జాతీయ జెండాను ర్యాలీగా ప్రదర్శించారు. బేతంచెర్ల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, తహశీల్దార్‌ నరేంద్ర నాథ్‌ రెడ్డి, ఎస్‌ఐ శివశంకర్‌ నాయక్‌ వారి కార్యాలయాల్లో జెండాలను ఎగురవేశారు. బండి ఆత్మకూర్‌లో మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులు దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి, ఎస్సై మల్లికార్జున, తహశీల్దార్‌ కార్యాలయంలో రవికుమార్‌, ఆయా గ్రామాల్లో సర్పంచులు జెండాను ఎగురవేశారు.