Apr 15,2023 22:45

సమీక్ష సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌, అధికారులు

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని లెక్టర్‌ అరుణ్‌ బాబు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరు చాంబర్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పై సిపిఒ, గ్రామ వార్డు నోడల్‌ అధికారులతో, ఎంపీడీవోలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన పనులకు అవసరమైన ప్రతిపాదనలు త్వరితగతిన పంపాలన్నారు. 1466 పనులు మంజూరు కాగా 995 పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయని, మిగిలిన పనులను చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సిపిఒ విజరు కుమార్‌, నోడల్‌ అధికారి శివారెడ్డి, ఎంపీడీవోలు పాల్గొన్నారు.