Oct 30,2023 21:21

ఫొటో : పనులు పరిశీలిస్తున్న ఎంపిపి తూమాటి విజయభాస్కర్‌ రెడ్డి

అభివృద్ధి పనులు పరిశీలన
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ (చేజర్ల ) : మండల కేంద్రమైన చేజర్ల గిరిజన కాలనీలో గ్రామపంచాయతీ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం చేజర్ల మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులు తూమాటి విజయభాస్కర్‌ రెడ్డి పరిశీలించారు. చేజర్ల గ్రామపంచాయతీ సాధారణ నిధులను ఉపయోగించి గిరిజన కాలనీలో సైడ్‌ కాలువలు నిర్మాణం చేపట్టారు. ముగింపు దశలో ఉన్న పనులను ఎంపిపి పరిశీలించి నిర్మాణాలు నాణ్యతతో నిర్మించి ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడాలని గ్రామ సర్పంచ్‌ ఆవుల వెంకటేశ్వర్లుకు సూచించారు.
చేజర్ల గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించి ఆదర్శ గ్రామంగా ముందుకు తీసుకువెళ్తామని తెలియజేశారు. ఆయనవెంట గ్రామ సర్పంచ్‌ ఆవుల వెంకటేశ్వర్లు, వైసిపి నాయకులు వంగవరుగు ఆనంద రెడ్డి, తదితరులున్నారు.