Jul 15,2023 08:54

అధికారులతో మాట్లాడుతున్న మంత్రి గమ్మనూరు జయరాం

         పుట్టపర్తి అర్బన్‌ : అధికారులు అభివద్ధి పనులను బాధ్యతగా తీసుకుని, అనుకున్న సమయంలోపు వాటిని పూర్తి చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి, రాష్ట్ర కార్మిక ఉపాధి ఫ్యాక్టరీస్‌ శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో పుట్టపర్తి నియోజకవర్గం అభివద్ధిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ బోయ గిరిజమ్మ, కలెక్టర్‌ అరుణ్‌ బాబు, జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌చేతన్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నవరత్నాల ద్వారా పూర్తిస్థాయి అర్హత ఉన్న లబ్ధిదారులందరికీ లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వచ్చిన సమస్యలను తిరిగి నిర్వహించే సమయానికి పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా అవినీతి జరగరాదన్నారు. జిల్లా అభివద్ధి కోసం పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ వచ్చే సమావేశం నాటికి ప్రగతి కనిపించాలన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఈ జిల్లాకు రావాల్సిన నిధులను సిపిఒలు సంప్రదించి రాబట్టాలన్నారు. నియోజకవర్గంలో రూ.25 కోట్లతో 412 సిసి రోడ్లు నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు అధికారులందరూ సమిష్టిగా పనిచేసి పరిష్కరించాలన్నారు. నియోజకవర్గంలో 193 చెరువులకు నీరు అందించేందుకు భూ సేకరణ చేపట్టాలన్నారు. గాజుకుంటపల్లి, నల్లమాడలో నిర్మించే రిజర్వాయర్లకు భూ సేకరణ పూర్తి చేయాలన్నారు. ముదిగుబ్బ నుంచి బుక్కపట్నం వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి పనులు వేగవంతంగా జరగాలన్నారు. అక్టోబర్‌ నాటికి ఈ పనులు పూర్తి కావాలని సూచించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి దీనిపై సమావేశం నిర్వహించాలన్నారు. ఎన్‌హెచ్‌ 716జి రహదారిలో జంక్షన్‌ ఏర్పాటుకు స్థల సేకరణ చేయాలన్నారు. లో వోల్టేజ్‌తో విద్యుత్‌ మోటార్లు కాలిపోతున్నాయని వచ్చే అక్టోబర్‌ నాటికి జగరాజుపల్లి, కుంట్లపల్లి, నల్లమాడలో సబ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. నియోజవర్గంలో అవసరమైన విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయాలన్నారు. నల్లమాడలో మార్కెట్‌ యార్డ్‌ పనులు పూర్తి చేయాలని తెలిపారు. నియోజకవర్గంలో 25 వేల ఇల్లు నిర్మాణంలో ఉన్నాయని అవి పూర్తి చేయాలన్నారు. కార్యక్రమం అనంతరం మంత్రి సత్యసాయి మహాసమాధిని సందర్శించారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ కొండయ్య, ఎడిసిసి బ్యాంక్‌ ఛైర్‌పర్సన్‌ లిఖిత, పుడా ఛైర్‌పర్సన్‌ లక్ష్మీ నరసమ్మ ఆర్డీవోలు భాగ్యరేఖ, రాఘవేంద్ర, సిపిఒ విజరుకుమార్‌, గహ నిర్మాణ శాఖ పీడీ చంద్రమౌళి రెడ్డి, పిఆర్‌ ఎస్‌ఈ గోపాల్‌ రెడ్డి, వ్యవసాయ అధికారి సుబ్బారావు, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, డిపిఒ విజరు కుమార్‌, డ్వామా పీడీ రామాంజనేయులుతో పాటు తహశీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.