అభివృద్ది పనులనుయ పరిశీలన చేస్తున్న చైర్‌పర్సన్ ఇంద్రజ
హిందూపురం:పురపాలక సంఘం వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనుల్లో గుత్తేదారులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పనులను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని అధికారులకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇంద్రజ సూంచారు. శుక్రవారం 32వ వార్డు ఆహ్మాద్ నగర్‌లో రూ.22లక్షల సాధరణ నిధులతో రిటైనింగ్ వాల్, మరో రూ.22 లక్షల సాధరణ నిధులతో పాటు రూ.22లక్షల గడప గడపకూ మన ప్రభుత్వం నిధులతో చేపడుతున్న రోడ్ల పనులను అధికారులతో కలిసి చైర్‌పర్సన్ పరిశీలన చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరగ పూర్తి చేయాలని గుత్తేదారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రేష్మా బాబు, డిఈఈ వెంకట రమణ, వైసిపి నాయకులు పాల్గొన్నారు.










