Aug 19,2023 20:23

మాట్లాడుతున్న వైసిపి నాయకులు నకేష్‌ రెడ్డి

ప్రజాశక్తి - కౌతాళం
బదినేహాల్‌ గ్రామ ఉప ఎన్నికల్లో అభిమానం గొప్పదని ప్రజలు నిరూపించారని వైసిపి నాయకులు నకేష్‌ రెడ్డి తెలిపారు. శనివారం జరిగిన ఉప ఎన్నికలో వైసిపి మద్దతుదారుడు పెద్ద నరసప్ప 387 ఓట్ల మెజార్టీతో గెలుపొందడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టిడిపి నాయకులు ఓట్ల కోసం డబ్బులు పంపిణీ చేసినా ప్రజలు తమపై అభిమానం చూపి మంచి మెజార్టీతో గెలిపించారని తెలిపారు. తమ కుటుంబంపై గ్రామస్తులు చూపిన అభిమానం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. టిడిపి నాయకుల్లాగా తానూ డబ్బులు పంచి ఉంటే టిడిపికి డిపాజిట్‌ కూడా దక్కేది కాదన్నారు. తాను అలా చేయకుండా ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నానన్నారు. ప్రజలు తమ వైపే ఉన్నారనడానికి ఈ ఎన్నికలే నిదర్శనమన్నారు.
తిక్కా రెడ్డికి తిక్క పట్టింది..!
టిడిపి మంత్రాలయం ఇన్‌ఛార్జీ తిక్కారెడ్డికి తిక్కపట్టిందని, అందుకే తిక్క తిక్క పనులు చేస్తున్నారని నకేష్‌ రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు పొందాలి కానీ, డబ్బు ఆశ చూపి ఓట్లు వేయించుకోవాలని అనుకోవడం తిక్క ఆలోచన అని అభివర్ణించారు. ఈ ఉప ఎన్నిక ఆయనకు మంత్రాలయం టికెట్‌ దక్కకుండా చేస్తోందని తెలిపారు. లక్ష్మిరెడ్డి, రవీంద్రారెడ్డి, మాబుసాబ్‌, ప్రసన్న గౌడ్‌ పాల్గొన్నారు.