ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి:భారత పొగాకు బోర్డు నూతన చైర్మన్‌గా సిహెచ్.యశ్వంత్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ప్రకాశం జిల్లాకు చెందిన యశ్వంత్‌ను బోర్డు చైర్మన్‌గా క్యాబినెట్ వ్యవహారాల నియామకాల కమిటీ ఎంపిక చేసింది. గుంటూరులోని పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు. రైతులకు, వ్యాపారులకు మధ్య సమన్వయం చేసుకుంటూ బోర్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు.










