బౌలింగ్‌లో నిషాంత్ సింధు
సెమీస్‌లో బంగ్లాదేశ్-ఎపై సంచలన విజయం
ఫైనల్లో పాకిస్తాన్‌ాఎతో ఢ
ఎసిసి ఎమర్జింగ్ ఆసియాకప్
కొలంబో: ఎసిసి ఎమర్జింగ్ ఆసియాకప్‌లో భారత యువ క్రికెటర్లు అదరగొట్టారు. స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌ాఎ ముందు ముంచినా.. ఆ లక్ష్యాన్ని బంగ్లా బ్యాటర్స్ ఛేదించకుండా నిలువరించిన తీరు వర్ణనాతీతం. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఎ జట్టు 49.1ఓవర్లలో 211పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో బంగ్లాదేశ్-ఎను 34.2 ఓవర్లలో 160పరుగులకే పరిమితం చేసి 51పరుగుల తేడాతో విజయం సాధించింది. ఛేదన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు అద్భుత ఆరంభాన్నిచ్చారు. మహ్మద్(38), హసన్(51) కలిసి తొలి వికెట్‌కు 70పరుగుల గట్టి పునాదిని వేశారు. బంగ్లా జట్టు తొలి వికెట్ కోల్పోయిన అనంతరం భారత స్పిన్నర్లు నిషాంత్ సంధు(5/20), మానవ్(3/32) సమిష్టిగా చెలరేగారు. దీంతో బంగ్లాదేశ్ బ్యాటర్స్‌కు కష్టాలు తప్పలేదు. రెండో వికెట్‌ను 94పరుగుల వద్ద కోల్పోయిన బంగ్లా ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. దీంతో బంగ్లాదేశ్ జట్టును 34.2ఓవర్లలో 160పరుగులకు ఆలౌటైంది. ఈ గెలుపుతో భారత్‌ాఎజట్టు 8వ ఎసిసి ఎమర్జింగ్ ఆసియాకప్ టైటిల్‌పై కన్నేశారు. అంతకుముందు టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టుకు శుభారంభం దక్కలేదు. పాకిస్తాన్‌పై చెలరేగిన సాయి సుదర్శన్(21) త్వరగా పెవీలియన్‌కు చేరాడు. అభిషేక్ శర్మ(34) రాణించినా.. కెప్టెన్ యశ్ ధుల్(66) మినహా మిగతా బ్యాటర్ నిరాశపరిచారు. భారత్-ఎ జట్టు ఓ దశలో 137పరుగులకే 7వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో కెప్టెన్ యశ్ ధుల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారతజట్టు 211పరుగుల గౌరవప్రద స్కోర్ చేయగల్గింది. మెహిదీ హసన్, తంజిమ్, రఖీబుల్‌కు రెండేసి, రిపోన్, సైఫ్, సర్కార్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ యశ్ ధుల్‌కు లభించింది.
పాకిస్తాన్-ఎ ఘన విజయం
తొలి సెమీస్‌లో పాకిస్తాన్-ఎ జట్టు శ్రీలంకాఎపై 60పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 322పరుగుల షభారీస్కోర్‌ను నమోదు చేసింది. యూసుఫ్(88), మహ్మద్(52) అర్ధసెంచరీలతో రాణించారు. లాహిరు, మధుశన్, కరుణరత్నేకు రెండేసి, సాహన్, దునిత్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ఛేదనలో శ్రీలంక జట్టు 45.4ఓవర్లలో 262పరుగులకు ఆలౌటైంది. ఆర్షాద్ ఇక్బాల్‌కు ఐదు, ముబాసిర్, ముఖీమ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఆర్షాద్ ఇక్బాల్‌కు లభించింది. ఆదివారం జరిగే ఫైనల్లో టైటిల్‌కై భారత్‌ాఎ, పాకిస్తాన్-ఎ జట్లు తలపడనున్నాయి.










