Jul 14,2023 22:02

ఎసిసి ఎమర్జింగ్‌ ఆసియాకప్‌లో ఇండియాాఏ ఘన విజయం
కొలంబో: ఎసిసి ఎమర్జింగ్‌ ఆసియాకప్‌లో ఇండియా-ఏ జట్టు కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ అజేయ సెంచరీతో కదం తొక్కాడు. దీంతో ఇండియాాఏ జట్టు 8వికెట్ల తేడాతో యుఏఇాఏజట్టుపై ఘన విజయంసాధించింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన యుఏఇాఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 175పరుగులు చేసింది. కెప్టెన్‌ చిదంబరం(46)టాప్‌ స్కోరర్‌. హర్షీత్‌ రాణాకు నాలుగు, నితీశ్‌రెడ్డి, మానవ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో ఇండియాాఏ కెప్టెన్‌ యశ్‌ ధుల్‌(108నాటౌట్‌; 84బంతుల్లో 20ఫోర్లు, సిక్సర్‌), నికిన్‌ జోష్‌(41నాటౌట్‌) బ్యాటింగ్‌లో రాణించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ యశ్‌ ధుల్‌కు లభించింది. గ్రూప్‌ాబిలో మరో లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ాఏ జట్టు 4వికెట్ల తేడాతో నేపాల్‌ను ఓడించింది. దీంతో ఈ గ్రూప్‌లో భారత్‌ అగ్రస్థానంలో ఉండగా.. పాకిస్తాన్‌ జట్టు రెండోస్థానంలో నిలిచింది. 17న ఇండియాాఏ జట్టు నేపాల్‌ాఏతో తలపడనుంది.