ప్రజాశక్తి-ఘంటసాల (కృష్ణా) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘంటసాల ప్రధాన సెంటర్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను వైసీపీ సీనియర్ నేత గొర్రెపాటి గోపాలకృష్ణ ఆవిష్కరించారు. వైసిపి నాయకులు కార్యకర్తలు వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తుమ్మల మురళీకృష్ణ, ఘంటసాల ఎఎంసి చైర్మన్ వేమూరి వెంకట్రావు, జేసిఎస్ కన్వీనర్ వేమూరి ప్రవీణ్, వైసీపీ మండల కార్యదర్శి దిరిశం పిచ్చేశ్వరరావు, సర్పంచ్లు రాచూరి ప్రసాద్ బాబు, ముళ్ళపూడి పట్టాభి రామారావు, పిఏసీఎస్ చైర్పర్సన్లు వేమూరి రత్నశేఖర్, గల్లా గిరీష్, నేతలు పడమట వీరకుమార్, పాల సోమేశ్వరరావు, దోనే వెంకటేశ్వరరావు, కొడాలి గంగాధరరావు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.










