Oct 26,2023 11:17

ప్రజాశక్తి-శ్రీకాకుళం : ఇచ్చాపురం నుంచి వైసిపి సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆ పార్టీ నేతలు అన్నారు. గురువారం.. ఇచ్ఛాపురంలో మంత్రి బొత్స సత్యనారాయణ జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే వి.కళావతి, గొర్లె కిరణ్‌ కుమార్‌, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్‌, వరదు కల్యాణి పాల్గొన్నారు.