Jun 18,2023 09:22

కాంటినెంటల్‌ ఆఫ్రికా నుంచి సుమారు 250 మైళ్లు నీటి ద్వారా వేరుచేయబడింది మడగాస్కర్‌ సాహస ద్వీపం. పశ్చిమ మడగాస్కర్‌లోని మెనాబే ప్రాంతంలో మొరోండావా, బెలోని సిరిబిహినా మధ్యనున్న ద్వీప దేశంలో అనేక రహస్యాలతో జెయింట్‌ మాత్‌లు, బగ్‌-ఐడ్‌ లెమర్‌లు, సర్రియల్‌ అమెన్యూ ఆఫ్‌ ది బావో బాబ్స్‌ వంటి ప్రదేశాలు ఉన్నాయి. ఇవి శతాబ్దాల నాటి మహా మానులు. ఇవి దాదాపు 100 అడుగుల ఎత్తు ఉంటాయి. ఈ బాబ్‌ వృక్షాలు 800 ఏళ్ల వరకూ జీవించగలవు. దట్టమైన ఉష్ణమండల ప్రాంతంలో ఇవి పెరుగుతాయి. 1950 నాటి డాక్యుమెంటేషన్‌ ప్రకారం 2000 నాటికి 50 శాతం అడవులు అంతరించిపోయాయి. కలప అక్రమ తరలింపు, వ్యవసాయం కారణంగా ఏటా తొమ్మిదివేల ఎకరాలు అంతరించిపోతున్నాయని అంచనా. ఈ చెట్టు బెరడు, ఆకులు, ఫలాలు ఆహారంగానూ, మందుల తయారీలోనూ ఉపయోగిస్తారు.

1

 

2

 

4

 

5

 

4

 

5