కార్పెంటర్ల అభివృద్ధి, సంక్షేమానికి కృషి : మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి
ప్రజాశక్తి-ఉరవకొండ (అనంతపురం) : నియోజకవర్గంలో కార్పెంటర్ల సంక్షేమానికి తన వంతుగా కృషి చేస్తానని ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉరవకొండలో కార్పెంటర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు మహబూబ్ బాషా, అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, రాష్ట్ర కార్యదర్శి బసవరాజు, జాయింట్ సెక్రటరీ రాజు ఆచారి తదితరులు వారి ఇబ్బందులను మాజీ ఎమ్మెల్యే దష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా తమ యూనియన్ సమావేశాలు నిర్వహించుకోవడానికి ఎటువంటి కార్యాలయం లేదని కావున కార్యాలయం నిర్మించుకోవడాని 5 సెంట్ల స్థలం కేటాయించాలని కోరారు.దీనిపై స్పందించిన విశ్వేశ్వరరెడ్డి గ్రామ పంచాయతీతో మాట్లాడి స్థలం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లలిత, వైస్ ఎంపీపీ నరసింహులు, కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ గోవిందు, పీఏసీఎస్ చైర్మన్ వడ్ల షేక్షావలి, మాజీ జెడ్పిటిసి తిప్పయ్య, నాయకులు బసవరాజు, కోదండరాం, వార్డు సభ్యురాలు పద్మావతి, బ్యాళ్ల ప్రసాద్, వేమన్న, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.










