Aug 04,2023 22:01

ఆర్చరీ ప్రపంచకప్‌లో తొలిసారి బంగారు పతకం కైవసం
బెర్లిన్‌: ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు రికార్డు నెలకొల్పింది. బెర్లిన్‌లో జరుగుతున్న ఆర్చరీ పోటీల్లో మహిళల కాంపౌండ్‌ విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకొని ఈ రికార్డును సాధించింది. జ్యోతి సురేఖ, పర్నీత్‌ కౌర్‌, అదితీ గోపించంద్‌ స్వామితో కూడిన మహిళల కాంపౌండ్‌ ఆర్చరీ జట్టు శుక్రవారం జరిగిన ఫైనల్లో మెక్సికోపై 235-229 పాయింట్లతో విజయం సాధించింది. ఫైనల్‌ రౌండ్‌లో గురి తప్పకుండా బాణం విసిరి ఈ పోడియంపై భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. స్వర్ణ పతకం నెగ్గిన అనంతరం వీరు మాట్లాడుతూ.. 'మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఈ పోటీల్లో దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించాం. టోర్నీ ఆరంభం నుంచి ఫైనల్‌ వరకు ఆటపైనే దృష్టి పెట్టాం. కచ్చితంగా బంగారు పతకం గెలుస్తామనే నమ్మకంతో బరిలోకి దిగాం' అని తెలిపారు. స్వర్ణ పతకం గెలిచే క్రమంలో భారత మహిళా ఆర్చర్లకు తొలి రౌండ్‌లోనే బై లభించింది. ఆ తర్వాతి రౌండ్‌లో చైనీస్‌ తైపీనిక్వార్టర్స్‌లో టర్కీని ఓడించి సెమీస్‌కు చేరారు. సెమీస్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కొలంబియాను 220ా216తో ఓడించి ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే.