Sep 13,2023 10:34

ముంబయి : ఆహార భద్రత, రేషన్‌ వ్యవస్థకు చెందిన వివిధ డిమాండ్ల సాధన కోసం ముంబయిలో వేలాది మంది మహిళలు ఐద్వా నేతృత్వంలో కదం తొక్కారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు పికె శ్రీమతి, మరియం ధవాలే ప్రసంగించారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి ప్రాచి హతివేలార్‌ కూడా పాల్గొన్నారు. అలాగే ఈ సమావేశంలో సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందకరత్‌, ఐద్వా ఉపాధ్యక్షురాలు, పొలిట్‌ బ్యూరో సభ్యులు సుభాషిణి అలీ కూడా ప్రసంగించారు. ఈ సమావేశం అనంతరం మహారాష్ట్ర పౌర సరఫరాల మంత్రి చౌగన్‌ బుజ్‌బాల్‌కు తమ డిమాండ్లపై వినతి పత్రాన్ని ఐద్వా ప్రతినిధులు అందచేశారు.