తనకల్లు (అనంతపురం) : రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలైన ఘటన బుధవారం అనంతపురం జిల్లాలోని తనకల్లు మండల పరిధిలోని కొక్కంటి క్రాస్ లో జరిగింది. అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం యేసు వారి పల్లికి చెందిన గీత, సుబ్బయ్య బైక్ పై కొక్కంటికి వెళుతుండగా, లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










