ప్రజాశక్తి-తుగ్గలి (కర్నూలు) : తుగ్గలి మండలం జన్నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపురం గ్రామంలో శనివారం రాత్రి పద్మావతి (35) అనే మహిళను భర్త ఇంట్లోనే అతికిరాతకంగా నరికి హత్య చేశాడు. అనంతపురం జిల్లా, గుంతకల్ మండలం, ములకలపెంట గ్రామానికి చెందిన పద్మావతి కు రాంపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు తో వివాహం జరిగింది. అయితే కొన్ని కుటుంబ కలహాల కారణాలే హత్యకు కారణమని తెలుస్తుంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే పద్మావతి రాంపురంలోని భర్త ఇంట్లోనే హత్యకు గురయింది. పద్మావతి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామాంజినేయులు తెలిపారు.










