ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : కరెంట్ షాక్ కొట్టి మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం ఎల్లుట్ల గ్రామంలో జరిగింది. మండల పరిధిలోని ఎల్లుట్ల గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన కట్టుబడి గంగయ్య భార్య కుల్లాయమ్మ (35) బాత్రూంలోని వాటర్ హీటర్ వల్ల కరెంట్ షాక్ తగిలి చనిపోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










